థైరాయిడ్
థైరాయిడ్ సమస్యకు
ప్రధానకారణం శరీరంలో హార్మోనులు అసమతుల్యత, మనం తీసుకునే ఆహారంలో
పోషకాల లోపం. నియంత్రణ లేకుండా థైరాయిడ్ గ్రంధి ఎక్కువ లేదా తక్కువ హార్మోన్లు
ఉత్పత్తి చేయడం ద్వారా థైరాయిడ్ సమస్య ఏర్పడుతుంది. ఇది మన బరువు మీద ప్రభావితం
చేయడమే కాకుండా, శరీరంలోని అనేక ఇతర భాగాలను కూడా ప్రభావితం
చేస్తుంది. ముఖ్యంగా మహిళల్లో థైరాయిడ్ సమస్యకు
ఎక్కువగా వస్తుంది. థైరాయిడ్ ఉన్నవాళ్లు ఆహారం పట్ల సరైన జాగ్రత్తలు
తీసుకోవడం చాలా ముఖ్యం. థైరాయిడ్ సరిగా పనిచేయటానికి ముఖ్యంగా కావాల్సిన పోషకం
అయోడిన్. రిఫైన్ చేయని ముడి సముద్రపు ఉప్పు ద్వారా లభిస్తుంది.
థైరాయిడ్
లక్షణాలు
>థైరాయిడ్ ఎక్కువగా ఉంటే తరచూ నీరసంగా కనబడం, బరువు
పెరగడం, గొంతు వాపు ఎక్కువగా ఉంటుంది.
>థైరాయిడ్
సమస్య ఊన్నపుడు స్త్రీలో రుతు
క్రమంలో మార్పులు, బ్లీడింగ్ ఎక్కువ కావడం వంటి సమస్యలు
ఎదరౌవుతాయి.
>గర్బిణి స్త్రీలో హైపో థైరాయిడిజమ్ ఉన్నప్పుడు పుట్టిన పిల్లలలో
మరుగుజ్జుతనం, పెరుగుదల తక్కువయి, బుద్ధి
మాంద్యం, వంధ్యత్వం ,చర్మం మందంగా ఉండి ఎండినట్లు కనిపిస్తుంది. ఎత్తైన పొట్ట, లావైన పెదాలు,
పెద్దదైన నాలుక ఈ వ్యాధి లక్షణాలు.
>థైరాయిడ్
అసమతుల్యత వల్ల వచ్చే అతి పెద్ద సమస్య ఆర్థరైటిస్, అంటే కీలు లోపల
అంతా వాచిపోయి, కదిపితే తీవ్రమైన నొప్పి వస్తుంటుంది.
>అంతే కాదు, థైరాయిడ్ సమస్య వల్ల మహిళల్లో సంతానలేమి,
సంతానోత్పత్తికి ప్రభావం చూపిస్తుంది.
>చిరాకుగా
ఉండడం,
డిప్రెషన్ వంటి హైపోథైరాయిడిజం యొక్క ముఖ్య లక్షణాలు.
తీసుకోవలసిన ఆహార
పదార్ధాలు
>అయోడిన్ కలిగి ఉన్న ఆహారాన్ని తినాలి. దీనికి మంచి మార్గం అయోడైజ్డ్
ఉప్పును తినడం.
>రోజుకు 3
నుంచి 4 లీటర్ల నీరు తాగాలి.
>వాల్నట్స్లో
ఉండే మెగ్నీషియం థైరాయిడ్ గ్రంధి పనితీరును మెరుగుపరుస్తుంది.
>చేపలలో
ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎల్డిఎల్ (చెడు కొలెస్ట్రాల్ )ను
తగ్గిస్తాయి.
>క్యారట్, కాలీఫ్లవర్, ముల్లంగి,
ఆకుకూరలు, పాలకూర, బ్రస్సెల్స్,
మొలకలు, బెల్ మిరియాలు, టమోటా,
ఆపిల్, బెర్రీలు, కివీ,
నారింజ, నిమ్మ, ద్రాక్షపండు
మొదలైనవి చాలా మంచివి.
>ఫ్యాట్ తక్కువగా ఉండే పాలు, యోగార్ట్, చీజ్ వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
>మీరు పాల
ఉత్పత్తులను జీర్ణించుకోకపోతే, మీరు బాదం పాలను కూడా తీసుకోవచ్చు.
>ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు కూడా మీకు చాలా మేలు చేస్తాయి.
>అలాగే
ఆలివ్ నూనెతో అధిక బరువు సమస్యను అధిగమిస్తారు.
>నిత్యం
ఉదయాన్నే పరగడుపున ఒక స్పూన్ అల్లం రసం తేనెతో సేవించాలి.
>గుడ్డు
లో అయోడిన్ మరియు ప్రోటీన్ సమృద్ధిగా
ఉంటుంది దీనిని హైపోథైరాయిడిజం మరియు హైపర్ థైరాయిడిజం ఉన్నవారు ఇద్దరూ తినవచ్చు.
>క్యాబేజి, కాలీప్లవర్,
బ్రకోలి, ముల్లంగి లాంటివి ఎంత తక్కువగా
తీసుకుంటే అంత మంచిది.
>అవిసె
గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా లభిస్తాయి.
>వేయించిన
ఆహారం కూడా తక్కువ తీసుకోవడం మంచిది వేయించిన బంగాళదుంప చిప్స్, నూడుల్స్
వంటి జంక్ ఫుడ్ తినకూడదు.
>ముడి లేదా సగం ఉడికించిన ఆకుకూరలు
బ్రోకలీ,
బచ్చలికూర, కాలీఫ్లవర్ మరియు అనేక ఇతర
కూరగాయలు మరియు పండ్లు థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని నిరోధించగలవు, వీటిని గోయిట్రోజెన్స్ అని పిలుస్తారు.
0 Komentar