ఎనిమిదో
ఖండం... జిలాండియా
భూమిపై
ఎన్ని ఖండాలు ఉన్నాయి అంటే టక్కున చెప్పే సమాధానం ఏడు. కానీ, భూమిపై ఎనిమిదో ఖండం
కూడా ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ
ఖండం పేరు జిలాండియా. ఇది న్యూజిలాండ్ కు సమీపంలో
ఉన్నది. 2017 వ సంవత్సరంలోనే
ఈ ఖండాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒకప్పుడు
అన్ని ప్రాంతాల్లాగానే ఈ ఖండం కూడా సముద్రంలో
పైకి తేలుతూ ఉండేది.
కానీ, కొన్ని
కారణాల వలన ఈ ఖండం సముద్రంలో కలిసిపోయింది.
జిలాండియా చిన్న ఖండం ఏమి కాదు. దాదాపుగా
50 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో
ఈ ఖండం వ్యాపించి ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బాతిమెట్రి అనే విధానం ద్వారా ఈ జిలాండియా కు సంబంధించిన మ్యాప్ ను న్యూజిలాండ్
శాస్త్రవేత్తలు తయారు చేశారు. 50 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో
వ్యాపించిన ఈ జిలాండియా ఖండంలో కేవలం 6 శాతం
మాత్రమే సముద్రంపైకి కనిపిస్తుంది. కనిపించే
ఆ భూభాగంలోనే న్యూజిలాండ్ దేశం ఏర్పడింది.
న్యూ క్యాలడోనియా దీవులు విస్తరించి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 1995లోనే
బ్రూస్ లుయెండిక్ అనే భౌతిక శాస్త్రవేత్త మొదట ఎనిమిదో ఖండాన్ని గుర్తించాడు. జిలాండియా అనే పేరు పెట్టింది కూడా ఆయనే.
0 Komentar