Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

7th Pay Commission recommendations on night duty allowance

7th Pay Commission: Central govt employees salary to go up as Centre revises Night Duty Allowance rules
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నైట్ డ్యూటీ అలవెన్స్ విషయంలో కొత్త నియమనిబంధనలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నైట్ డ్యూటీ అలవెన్స్ విషయంలో కొత్త నియమనిబంధనలు అమల్లోకి వచ్చాయి. 7వ పే కమిషన్ ఇచ్చిన సిఫార్సులకు అనుగుణంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్-DoPT నైట్ డ్యూటీ అలవెన్సుల విషయంలో కొత్త నియమనిబంధనల్ని జారీ చేసింది. ప్రస్తుతం నైట్ డ్యూటీ అలవెన్సుల విషయంలో ఉద్యోగులు అందరికీ గ్రేడ్ పే ద్వారా అలెవన్సులు ఇస్తున్న విధానానికి ఫుల్ స్టాప్ పెట్టింది. కొత్త నియమనిబంధనలు 2017 జూలై 1 నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది. కొత్త నియమనిబంధనల ప్రకారం నైట్ వెయిటేజీని పరిగణలోకి తీసుకుంటే ఇక పనిగంటలు లెక్కలోకి రావు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు విధులు నిర్వహిస్తేనే నైట్ డ్యూటీగా పరిగణిస్తారు.
నైట్ డ్యూటీ అలవెన్సుల కోసం బేసిక్ వేతనం పరిమితి రూ.43,600 అని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్-DoPT వెల్లడించింది. నైట్ డ్యూటీ చేసే ఉద్యోగులకు ప్రతీ గంటకు 10 నిమిషాల చొప్పున వెయిటేజీ ఉంటుంది. నైట్ డ్యూటీ అలవెన్స్ గంటకు బేసిక్ పే+డీఏ/200 చొప్పున లెక్కిస్తారు. నైట్ డ్యూటీ అలవెన్సులకు లెక్కించే బేసిక్ పే, డీఏ 7వ పే కమిషన్ సూచించిన ప్రకారం ఉంటాయి. ఈ ఫార్ములా అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వర్తిస్తుంది. నైట్ డ్యూటీ చేసే సంబంధిత ఉద్యోగి బేసిక్ పే ఆధారంగా ప్రతీ ఉద్యోగికి వేర్వేరుగా నైట్ డ్యూటీ అలవెన్సును లెక్కిస్తుంది ప్రభుత్వం.
మూలం: New18 తెలుగు సౌజన్యంతో..
Previous
Next Post »
0 Komentar

Google Tags