Aadhaar services
in village and ward secretariats
గ్రామ, వార్డు
సచివాలయాలలో ఆధార్ సేవలు
కొత్త ఆధార్
కార్డు , ఏవైనా మార్పులకు, అలాగే ఆధార్ కార్డుకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన
పరిష్కారం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక నుంచి గ్రామ సచివాలయాల్లోనే
ఆధార్ సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రజలకు మరింత అందుబాటులో ఉండే విధంగా
చేసేందుకు జగన్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
కొత్త ఆధార్
కార్డులు జారీ, ఆధార్ కార్డుల్లో మార్పులు వంటి సేవలను సచివాలయాల
గ్రామ/ వార్డు సచివాలయాల ద్వారా అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం
పోస్టాఫీసులు, కొన్ని బ్యాంకుల్లో ఆధార్ కేంద్రాలు ఉన్న
సంగతి తెలిసిందే. దీనితో అవసరమైన ప్రదేశాల్లో సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలను
ఏర్పాటు చేయాలని సన్నద్ధం అవుతోంది. ఈ మేరకు ఎక్కడెక్కడ ప్రారంభించాలన్న దానిపై
అధికారులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. త్వరలోనే ఏపీవాసులకు ఆధార్ తిప్పలు
తప్పనున్నాయి.
0 Komentar