Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Aarogyasri another 87 therapeutic approaches included

Aarogyasri another 87 therapeutic approaches included

ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరో 87 చికిత్సా విధానాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 3వ తేది నుండే దాదాపు వెయ్యి చికిత్సా విధానాలను డాక్టర్ వైయస్ ఆర్ ఆరోగ్యశ్రీ పధకం పరిధిలోకి తెచ్చి పైలట్ ప్రాజెక్టుగా పశ్చిమ గోదావరి జిల్లాలో అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో 200 చికిత్సా విధానాలను రాష్ట్రం లో మిగిలిన 12 జిల్లాల్లో అమలు చేస్తున్నారు. ఇప్పటికే వెయ్యి రూపాయలకు మించిన 1000 చికిత్సా విధానాలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింప చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకం పరిధిలోకి మరో 87 చికిత్సా విధానాలను చేరుస్తూ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ పథకం తీరు తెన్నులను సమీక్షించిన డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ తాజాగా రూ.1000 నుండి రూ. 45 వేల వరకూ ఖర్చయ్యే మరో 87 చికిత్సా విధానాలను ఈ పథకం పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. ఇందులో ఇన్ పేషెంట్ కు అవసరమయ్యే 53 విధానాలతోపాటు, 29 స్వల్పకాలిక చికిత్సా విధానాలు, మరో 5 డేకేర్ విధానాలు ఉన్నాయి. ఈ పైలట్ ప్రాజెక్టును ఈనెల 16 నుండి విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
HM&FW Department – Inclusion of 87 new procedures in addition to the existing 1000 procedures Under Pilot Project- Expansion of Pilot Project in (6) Districts of Visakhapatnam, Vizianagaram, Guntur, Prakasam, Kurnool and YSR Kadapa with 887 procedures w.e.f 16.07.2020 under Dr.YSR Aarogyasri - Permission Accorded -Orders – Issued.
G.O.RT.No. 320, Dated: 16-07-2020.
DOWNLOAD

Previous
Next Post »
0 Komentar

Google Tags