AICTE says
engineering colleges to start from 15th September
సెప్టెంబర్
15 నుంచి ఇంజినీరింగ్ విద్యాసంవత్సరం
-షెడ్యూల్‌లో
మార్పుచేర్పులు చేసిన ఏఐసీటీఈ
దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ,
ఎంసీఏ తదితర వృత్తి, సాంకేతిక విద్యాసంస్థల
విద్యా సంవత్సరం సెప్టెంబర్ 15న మొదలుకానుంది. ఈ మేరకు గురువారం అఖిల భారత
సాంకేతిక విద్యామండలి(AICTE) రివైజ్డ్ అకడమిక్ క్యాలెండర్‌ను
జారీ చేసింది. ఈ విద్యాసంవత్సరం బీటెక్ మొదటి సంవత్సరం తరగతులను సెప్టెంబరు 1వ తేదీ నుంచి ప్రారంభించాలని గత నెలలో ఏఐసీటీఈ ప్రకటించిన సంగతి తెలిసిందే.
వాస్తవానికి ప్రతి ఏటా ఆగస్టు 1 నుంచి తరగతులు మొదలుకావాలి.
తాజా కరోనా పరిస్థితులను సమీక్షించిన ఏఐసీటీఈ.. ఈ సారి విద్యాసంవత్సరాన్ని సెప్టెంబరు
15వ తేదీ నుంచి ప్రారంభించేలా కాలపట్టికను విడుదల చేసింది. మిగతా
విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి తరగతులను మొదలుపెట్టాలని
సూచించింది. అదేవిధంగా జులై 15వ తేదీలోపు విశ్వవిద్యాలయాలు
కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని, మొదటి విడత బీటెక్
సీట్ల కేటాయింపును ఆగస్టు 30లోగా, రెండో
విడత కౌన్సెలింగును సెప్టెంబరు 10వ తేదీలోపు పూర్తి చేయాలని
నిర్ణయించింది. పీజీసీఎం/పీజీడీఎం కోర్సుల్లో చేరిన వారికి ఆగస్టు 1వ తేదీకల్లా తరగతులు ప్రారంభించాలని పేర్కొంది.
0 Komentar