అలెర్జీ
ప్రపంచవ్యాప్తంగా కనిపించే అత్యంత సాధారణమైన
వ్యాధి అలెర్జీ. కారణం కాలుష్యం, తినే ఆహారంలో మార్పులు, మన రోగ నిరోధక
వ్యవస్థల ప్రతిస్పందనలో మార్పులు తెచ్చే సూక్ష్మజీవులు తక్కువ ఉండడం మొదలైనవి. అలెర్జీ యొక్క
లక్షణాలు తక్కువగా ఉండవచ్చు, మరియు కొంతమందిలో అవి ప్రాణాంతకమైనవిగా ఉంటాయి. ఇటీవలి కాలంలో
అలెర్జీలు పెరుగుతూ పెద్ద ఆరోగ్య సమస్యగా పరణమించాయి.మన దేశ జనాభాలో 20 నుండి 30% మంది ఉబ్బసం, రినైటిస్, ఫుడ్ అలెర్జీ, తామర, వడదెబ్బ, డస్ట్
అలర్జీవంటి అలెర్జీల వల్ల బాధపడుతున్నారు. అల్లెర్జి
అనేది రోగనిరోధక వ్యవస్థకు కలిగే ఒక రుగ్మత. అలెర్జీ నివారించడానికి
ఉత్తమ మార్గం అలర్జీ కలిగించేవాటికి దూరంగా ఉండటం. ఒంటికి సరిపడని ఆహారాలు ఏవైనా తింటే
ప్రాణాపాయ పరిస్థితి తలెత్తుతుంది.
అలర్జీ లక్షణాలు :
>చర్మం ఎర్రగా కందిపోవడం, దద్దుర్లు, వాపు ఉంటాయి. మరీ ప్రమాదకరమైన
కేసుల్లో వాంతులవడం, విరేచనాలవడం, ఊపిరాడకపోవడం... శరీరానికి
సరిపడని ఇంజెక్షన్ చేయించుకున్నప్పుడు రియాక్షన్స్ కలగవచ్చు.
>అలెర్జీ వలన ముక్కు విపరీతంగా కారడం, ముక్కు దిబ్బడ ,ఇంకా కొన్ని
సార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా స్కిన్ అలెర్జీలు ఇబ్బందులు పెడుతుంటాయి.
>చిన్న పిల్లలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. వారిని దోమలు
కుట్టడం వలన స్కిన్ అలర్జీ వస్తుంది. పెంపుడు జంతువుల వలన కూడా కొన్ని రకాల
అలర్జీలు వస్తాయి.
సాధారణంగా అలర్జీ కలిగించే ఆహార పదార్థాలు:
>పాలు, గుడ్లు
>వేరుశనగ, నువ్వులు, సోయా
>ఆక్రోట్, బాదం, పైన్ గింజలు, బ్రెజిల్ నట్స్, పెకాన్సు వంటివి)
>చేపలు ,షెల్ ఫిష్ (రొయ్యలు, పీతలు వంటివి)
ఏదేమైన అలెర్జీ కలిగంచే పదార్దాలను గుర్తించి తినక పోవడమే మంచిది.
అలర్జీ నుండి ఉపశమనం కలిగించే ఆహార పదార్థాలు:
>ఆపిల్స్, బెర్రీస్, ఉల్లిపాయలు అలాగే బ్లాక్ టీ లో క్వేర్సేటిన్ అనే
యాంటిఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఎలర్జీలని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
>గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్
మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు డైజెస్టివ్ సిస్టమ్ ఫంక్షన్స్ సరిగా జరిగేలా చెయ్యడమే
కాక,
వ్యాధినిరోధకశక్తి
పెరుగుతుంది.
>అరటి పండు
తొక్కలోని ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా
విటమిన్లు, ఖనిజాలు, బి6, బీ 12, ఏ, సి విటమిన్స్, మాంగనీస్, పొటాషియం, పీచుపదార్థాలు, ప్రోటీన్స్, మెగ్నీషియంలుఆరోగ్యానికి
మాత్రమే కాదు చర్మానికి కూడా మేలు చేస్తాయి.
>పసుపు మరియు అల్లం అలర్జీ తగ్గించడంలో సహాయపడతాయి.
>నిమ్మరసం శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేయడంలో
సహయ పడి బాడీని క్లీన్ గా ఉంచుతుంది.వ్యాధినిరోధక శక్తిని పెంచే బూస్టింగ్ లక్షణాలు
తొ పాటు ఫుడ్ అలర్జీని నివారిస్తుంది.
>వెనిగర్ లోని మెడిసినల్ లక్షణాలు మరియు అసిడిక్
గుణం వల్ల ఫుడ్ అలర్జీ నివారిస్తుంది.
>గార్లిక్ లో ఉండే యాంటీబయోటిక్ మరియు యాంటీఆక్సిడెంట్స్, ఇన్ఫ్లమేటరీ
లక్షణాలు ఫుడ్ అలర్జీ నండి ఉపశమనాన్నిసస్తాయి.
>టోఫు, ఆకుకూరలు, బాదం, సన్ ఫ్లవర్
సీడ్స్, అవొకాడో, ష్రింప్ , ఆలివ్ ఆయిల్, బ్రొకోలి వంటివి వాటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.
>అరటిపండ్లు స్కిన్ రాషెస్ ను తగ్గిస్తాయి మరియు
పొట్ట సమస్యలను నివారించే, బాడీ మెటబాలిజంను రెగ్యులేట్ చేస్తాయి.
>టెల్ హెర్బ్ లోని యాంటీఇన్ఫ్లమేటరీ
లక్షణాలు వివిధ రకాల అలర్జీలను నివారిస్తుంది. పొట్టనొప్పి, ముక్కు కారడం, తుమ్ములు, స్కిన్ రాషెస్ వంటి లక్షణాలను ఉండి
ఉపశమనం కలిగిస్తుంది.
>విటమిన్ ఇ ఫుడ్స్ కూడా యాంటీ అలర్జినిక్ గా పనిచేస్తాయి. రెగ్యులర్
డైట్ లో తగినన్ని విటమిన్ సి ఫుడ్స్ ను వ్యాధినిరోధకతను పెంచడంతో
పాటు, అలర్జీలను
నుండి ఉపశమనం కలిగిస్తాయి.
Allergy Causes-symptoms,
Foods That Fight Allergies
0 Komentar