ఏదైనా కారణంతో ఇంటర్మీడియట్
ఒక్క పరీక్ష రాయకపోయినా ఏడాది నిరీక్షించాల్సిందే
-ఆంధ్రప్రదేశ్ లో సప్లిమెంటరీ
పరీక్షలను రద్దుతో దాదాపు 40వేల మంది విద్యార్థులు పై ప్రభావం
-తెలంగాణ లో సప్లిమెంటరీ
రద్దుతో దాదాపు 89,806 మంది విద్యార్థులపై ప్రభావం
కరోనా కారణంగా
ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేయడంతో దాదాపు 40వేల
మంది విద్యార్థులు ఏడాది సమయాన్ని కోల్పోనున్నారు. మార్చిలో నిర్వహించిన పరీక్షలకు
వివిధ కారణాలతో కొందరు విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇలాంటివారు అడ్వాన్స్‌డ్
సప్లిమెంటరీ రాసుకోవచ్చనే ఆలోచనతో ఉండగా.. ఇంటర్ విద్యామండలి వాటిని రద్దు
చేసింది. మార్చిలో పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత మార్కులు సాధించలేకపోయినా.. వారిని
ఉత్తీర్ణులుగా ప్రకటించింది. కానీ పరీక్షకు గైర్హాజరైన వారిని అనుత్తీర్ణులుగా
పేర్కొంది. దీంతో ఏదైనా కారణంతో ఒక్క పరీక్ష రాయకపోయినా ఏడాది నష్టపోవాల్సిన
పరిస్థితి ఏర్పడింది. తమకు పరీక్ష నిర్వహించాలని, ఏడాది సమయం
కోల్పోతున్నామని పలువురు విద్యార్థులు అధికారులకు విన్నవిస్తున్నారు. అయితే,
ఈ విషయంలో చేయగలిగింది ఏమీ లేదని అధికారులు సమాధానమిస్తున్నారు.
ఇక తెలంగాణ
విషయానికి వస్తే అనారోగ్యం, ప్రమాదాలు, వివిధ
కారణాలతో కేవలం ఒకే ఒక్క పరీక్షకు గైర్హాజరైన విద్యార్థుల సంఖ్య 17,353 ఉండగా..
రెండు, అంతకన్నా ఎక్కువ పరీక్షలకు గైర్హాజరైన వారి సంఖ్య 89,806గా
ఉంది. అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేయడంతో వీరందరికీ ఓ ఏడాది వృథా
కానుంది. ఇంటర్ సెకండియర్‌లో అన్ని సబ్జెక్టులు ఫెయిలైనా, ఫస్ట్
ఇయర్‌లో బ్యాక్‌లాగ్స్ ఉన్నా.. అందరినీ పాస్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం
తీసుకుంది.
కానుంది. ఇంటర్
సెకండియర్‌లో అన్ని సబ్జెక్టులు ఫెయిలైనా, ఫస్ట్ ఇయర్‌లో బ్యాక్‌లాగ్స్
ఉన్నా.. అందరినీ పాస్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
0 Komentar