ఆంధ్రప్రదేశ్
మంత్రి మండలి సమావేశ ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్
మంత్రి మండలి సమావేశం ముగిసింది. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.
>వైఎస్సార్
చేయూత పథకం అమలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఆర్థిక సాయం పథకంపై
కేబినెట్ చర్చింది.
>శాండ్
కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. శాండ్ కార్పొరేషన్‌లో
ప్రతినిధులుగా పలువురు మంత్రులు ఉండనున్నారు.. ఫైనాన్స్ మంత్రి సహా మరో ఇద్దరు
లేదా ముగ్గురు మంత్రులకు చోటు కల్పించనున్నారు.
>సీపీఎస్
రద్దు కోసం డిమాండ్ చేసిన ఉపాధ్యాయులపై నమోదైన కేసులను ఎత్తేయడానికి మంత్రివర్గం
అంగీకరించింది.
>ప్రకాశం
జిల్లా కేంద్రం ఒంగోలు, శ్రీకాకుళంలల్లో కొత్తగా రాజీవ్‌గాంధీ
యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ)ని ఏర్పాటు చేయడానికి కేబినెట్
అంగీకారం తెలిపింది.
>ప్రస్తుతం రాష్ట్రంలో ఇలాంటివి రెండే ఉన్నాయి. కడప జిల్లా
ఇడుపుల పాయ, కృష్ణాజిల్లా నూజివీడులో ఉన్నాయి. వాటికి అదనంగా
ఒంగోలులో కొత్త విద్యాసంస్థను నెలకొల్పడానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్
ఇచ్చింది.
>నెల్లూరు
జిల్లాలో దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో
నిర్మించడానికి కేబినెట్ అనుమతి ఇచ్చింది.
>పాఠశాల
విద్యాశాఖలో పోస్టుల భర్తీకి ఆమోదంపై చర్చించిన మంత్రివర్గం.
>మనబడి, నాడు-నేడులో
సవరించిన మార్గదర్శకాలపై చర్చ
>అగ్రికల్చరల్
ల్యాండ్ చట్టం 2006లోని 3, 7 సెక్షన్లు సవరించే అంశంపై చర్చ. ముసాయిదా
ఆర్డినెన్స్ ఆమోద ప్రతిపాదనపై చర్చ
>ఏపీ
పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020పై చర్చ. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల
ప్రోత్సాహంపై చర్చ
>ఏపీఆర్‌ఎస్‌డీఎంపీసీఎల్
ఏర్పాటుపై చర్చ.
>గండికోట
ప్రాజెక్టు పరిధి రైతులకు పరిహారం అందించడంపై చర్చ
>కడప జిల్లా
కొండాపురం నిర్వాసితులకు రూ.145 కోట్ల చెల్లింపుపై చర్చ
>ఏపీఐఐసీ రూ.2
వేల కోట్లు టర్మ్ లోన్ తీసుకునేందుకు అనుమతిపై చర్చ
>గవర్నర్
కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థుల ఖరారుపై చర్చ
కొత్త జిల్లాలపై
చర్చ
>కొత్త
జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటుపై మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ
ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కొత్త జిల్లా ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటు
కానుంది.
>వచ్చే ఏడాది
మార్చి 31వ తేదీలోగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని కేబినెట్
నిర్ణయించింది. పార్లమెంట్ నియోజకవర్గం సరిహద్దుగా కొత్త జిల్లాలు ఏర్పాటు
కానున్నాయి.
>అయితే 26వ
జిల్లా ఏర్పాటుకు సంబంధించి కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చకు వచ్చింది. కొత్తగా
ఏర్పాటు కానున్న అరకు జిల్లా భౌగోళికంగా ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉందని డిప్యూటీ
సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు.
>4
జిల్లాలకు అరకు జిల్లా ప్రాంతం విస్తరించి ఉందని సీఎం వైఎస్ జగన్ దృష్టికి
తీసుకెళ్లారు. ఈనేపథ్యంలో అరకును రెండు జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేయాలని
ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
0 Komentar