ఏపీలో అన్ని
ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా
సెప్టెంబర్
మూడో వారంలో ఎంసెట్ నిర్వహణ
కరోనా మహమ్మారి ప్రబళుతున్న
సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఎంసెట్ సహా
అన్ని రకాల ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు సోమవారం మంత్రి ఆదిమూలపు
సురేశ్ ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
సూచనతో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ మూడో
వారంలో ఎంసెట్ నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన పరీక్షా తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని
పేర్కొన్నారు.
జాతీయ ఎంట్రన్స్ పరీక్షలకు
ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన అన్ని
అంశాలపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. సమస్యలను పరిష్కరించేందుకు
రెగ్యులేషన్ మానిటరింగ్ కమిటీ పనిచేస్తోందన్నారు. ఆన్‌లైన్ కోర్సుల విధివిధానాలను
త్వరలోనే రూపొందిస్తామని మంత్రి పేర్కొన్నారు.
DED exams జరుగుతాయా? పోస్ట్ పోన్ అవుతాయా చెప్పండి?
ReplyDeleteSame doubt ,please anyone tell us will they get postponed or not
Delete