AP CM YS Jagan launched APCOS
-ఔట్ సోర్సింగ్
ఉద్యోగ నియామకాల కోసం APCOS ను ప్రారంభించిన
సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు అనుగుణంగా ‘ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్‌డ్
సర్వీసెస్’ (ఆప్కాస్)కు శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఉదయం
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీడియో
కాన్ఫరెన్స్ ద్వారా ఆప్కాస్‌ను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ "కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్‌డ్
సర్వీసెస్ తో ఎక్కడా కూడా అవినీతి చోటుచేసుకునే అవకాశం ఉండదు. జీతాలు, ఉద్యోగాల్లో ఎక్కడా చేతివాటాలకు అస్కారం లేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగ
నియామకాల్లో పారదర్శకత ఉంటుంది. ప్రతి ఒకనెలా 1వ తేదీనే జీతం
చెల్లిస్తాం. ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి విధానాలు కచ్చితంగా
పాటిస్తాం. ఎటువంటి లంచాలు, వివక్ష లేకుండా జీతాలు వారి
చేతుల్లోకే వస్తాయి. ప్రస్తుతానికి 50,449 మందికి నియామక
పత్రాలు ఇస్తాం. ఈ సంఖ్యను వచ్చే రోజుల్లో పెంచుతాం. ఇకపై సిఫారసులు, దళారీలకు చోటు లేదు. కాంట్రాక్టు ఉద్యోగులకు పూర్తి భద్రతను ఇస్తాం. కనీసం 50 శాతం ఎస్టీ,
ఎస్టీ, బీసీ, మైనార్టీలకు
ఉద్యోగాలు రానున్నాయి, అలాగే మహిళలకూ 50 శాతం ఉద్యోగాలు దక్కే విధంగా దీనిని అమలు చేస్తాం" అని అన్నారు.
APCOS Official website
CLICK HERE
APCOS Official website
CLICK HERE
0 Komentar