AP Governor
approved CRDA bill
సీఆర్డీఏ రద్దు, రాజధాని
వికేంద్రీకరణ బిల్లులకు ఆమోదం
ఇకపై మూడు
రాజధానులు :
1.శాసన రాజధానిగా
అమరావతి
2.పరిపాలనా
రాజధానిగా విశాఖపట్నం
3.జ్యుడీషియల్
రాజధాని గా కర్నూలు
ఆంధ్రప్రదేశ్
రాజధాని అంశంలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఆర్‌డీఏ-2014 రద్దు, వికేంద్రీకరణ-ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు,
పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం
తెలిపారు. రాష్ట్ర శాసనసభను ఆమోదం తెలిపి బిల్లును పరిశీలించిన గవర్నర్.. తన ఆమోద
ముద్రవేశారు.
2020 జనవరి 20న
హైపవర్ కమిటీ నివేదికపై మంత్రిమండలి చర్చించింది. 2020
జనవరి 20న బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. దీనిలో భాగంగానే 2020 జనవరి 22న శాసనమండలి ముందుకు బిల్లును తీసుకురాగా..
ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకించింది. దాని తరువాత న్యాయ నిపుణుల సలహా మేరకు 2020 జూన్ 16న రెండోసారి వికేంద్రీకరణ బిల్లుకు
అసెంబ్లీలో ఆమోదం లభించింది. తాజాగా ఈ బిల్లుకు గవర్నర్ రాజ ముద్రవేయడంతో
ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి రావడానికి లైన్‌క్లియర్ అయ్యింది.
0 Komentar