ఏపీలో
ద్రవ్యవినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం
రాష్ట్రంలోని ప్రభుత్వ
ఉద్యోగులకు శుభవార్త. ఏపీ ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
గురువారం ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులు, ఇతర ఆర్థిక బిల్లుల చెల్లింపులకు
అడ్డంకి తొలగిపోయింది. శాసనసభ ఆమోదించిన ద్రవ్య వినిమయ బిల్లుకు శాసన మండలిలో
ఆమోదించకుండానే మండలి డిప్యుటీ చైర్మన్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో ఈ
నెల 1వ తేదీన ఉద్యోగులకు, పెన్షనర్లకు
ప్రభుత్వం వేతనాలను చెల్లించలేకపోయింది. నిబంధనల మేరకు మండలి ఆమోదించకపోయినా ఆ
బిల్లును 14 రోజుల తర్వాత గవర్నర్ ఆమోదించవచ్చు. దీంతో 14 రోజుల గడువు ముగియడంతో గురువారం మధ్యాహ్నం గవర్నర్కు ద్రవ్య వినయమ
బిల్లును పంపగా సాయంత్రానికి ఆయన ఆమోదం తెలిపారు. దీని ప్రకారం ఆర్ధిక శాఖ గెజిట్
నోటిఫికేషన్ జారీ చేసింది.
0 Komentar