ఇంటర్మీడియట్ అకడమిక్
క్యాలండర్ సిద్ధం
ఆగస్టు 3
నుంచి కళాశాలలను ప్రారంభించేలా ఏర్పాట్లు
ఆగస్టు 3 నుంచి కళాశాలలను ప్రారంభించేలా ఇంటర్
విద్యాశాఖ ఈ ఏడాది అకడమిక్ క్యాలండర్-2021 ను సిద్ధం
చేసింది. పరిస్థితులకు అనుగుణంగా కళాశాలల్లో ఉదయం సైన్సు, మధ్యాహ్నం
ఆర్ట్స్ గ్రూపులకు తరగతులు నిర్వహిస్తారు. అలాగే విద్యార్థుల సామర్థ్యాలను నిరంతరం
అంచనా వేయడంతోపాటు వారిని పోటీ పరీక్షలకు సంసిద్ధులను చేసేందుకు యూనిట్ పరీక్షల
విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. జేఈఈ మెయిన్ పరీక్షలకు అనుగుణంగా బహుళైచ్ఛిక
ప్రశ్నలు, ఖాళీలు నింపడం లాంటి ప్రశ్నలతో సబ్జెక్టుకు ఒక
వర్క్ బుక్ ప్రత్యేకంగా ఇవ్వనున్నారు. కళాశాలలు మొత్తం 196
రోజులు పని చేయనున్నాయి. సీబీఎస్ఈ తరహాలో 30% పాఠ్యాంశాలు
తగ్గించనున్నారు. రెండో శనివారమూ శెలవులు ఉండవు అలాగే పండగ సెలవులలో కూడా కోత
విధించనున్నారు. విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలకు వీడియోలను రూపొందిస్తారు.
మార్చిలోనే వార్షిక పరీక్షలు నిర్వహించే విధంగా అకడమిక్ క్యాలండర్ ను
రూపొందిస్తున్నారు.
0 Komentar