కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 7వ, 8వ తరగతుల మరియు ఇంటర్ మొదటి
సంవత్సరం లో ప్రవేశానికి ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరణ
KGBV ADMISSIONS-2020
FOR 1ST YEAR INTERMEDIATE
For Application
Download
Submitted Application
KGBV ADMISSIONS-2020
FOR VII & VIII CLASSES
For Application
Download
Submitted Application
CLICK HEREసమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారు సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న 352 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు (కేజీబీవీలు)లో 2020-21 విద్యా సంవత్సరానికి గానూ 7వ, 8 వ తరగతుల మరియు ఇంటర్ మొదటి ప్రవేశానికి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూలై 20 నుంచి ఆగష్టు 02 వరకు ఆన్ లైనులో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పేద, అనాథ, బడి బయటి పిల్లలు, డ్రాపౌట్ (మధ్యలో బడి మానేసినవారు) బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆన్ లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణించబడతాయని తెలిపారు. KGVB లలో 10వ తరగతి చదివి పాస్ అయిన అందరుకూడా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొనవలయును. ఈ దరఖాస్తులు https://apkgbv.apcfss.in/వెబ్ సైట్ ద్వారా పొందగలరని తెలిపారు. ఎంపికైన విద్యార్థినులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందించబడుతుందని అన్నారు. సంబంధిత పాఠశాల - నోటీసు బోర్డులో, సమగ్ర వెబ్ సైట్ (https://ssa.ap.gov.in/SSA/) లోనూ చూడవచ్చని తెలిపారు. ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే 949438 3617, 94412 70099 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Please give me a data entry job sir
ReplyDelete