సంస్కరణల దిశగా ఉపాధ్యాయ
విద్య
-ప్రభుత్వ డైట్ ఖాళీ పోస్టుల్లో అర్హులైన స్కూల్ అసిస్టెంట్లతో డిప్యుటేషన్
-అక్రమాలు
జరిగినట్లు తేలిన 180 కాలేజీల గుర్తింపు రద్దు
ఉపాధ్యాయ విద్యను
బోధించే డైట్, సీటీఈ, ఐఏఎస్‌ఈలను బలోపేతం
చేసేందుకు ఖాళీలను సత్వరమే భర్తీ చేయడంతోపాటు అక్రమ ప్రవేశాలపై కఠినంగా
వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఖాళీ పోస్టుల్లో అర్హులైన స్కూల్
అసిస్టెంట్లను డిప్యుటేషన్‌పై నియమించనున్నారు. డీసెట్ ఆధారంగా అర్హులైన
అభ్యర్థులకు మాత్రమే డీఈడీలో ప్రవేశాలు కల్పించనున్నారు. కరిక్యులమ్‌లో పలు
మార్పులు చేసినా టీచర్ అభ్యర్థులకు సరైన శిక్షణ లేనందున ఫలితాలు సాధించడం కష్టంగా
మారుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పేరుకు మాత్రమే
కాలేజీలు..
ప్రైవేట్ డీఈడీ
కాలేజీల్లో అర్హులైన టీచర్లు లేరు. కాలేజీలు పేరుకు మాత్రమే ఉంటాయి కానీ
విద్యార్థులు ఉండరు. తనిఖీల సమయంలో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు.
విద్యార్థులు లేకున్నా ఉన్నట్లు రికార్డులు సృష్టిస్తున్నారు. బయోమెట్రిక్
హాజరును తప్పనిసరి చేయడం ద్వారా ఈ కాలేజీల్లో అక్రమాలకు కొంతవరకు తెరపడనుంది. పాఠశాల
విద్య,
నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ పరిధిలోకి డీఎడ్ కాలేజీలను కూడా
ప్రభుత్వం చేర్చింది. ఉన్నత విద్య, నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ పరిధిలోకి బీఈడీ కాలేజీలను తెచ్చింది. అక్రమాలు
జరిగినట్లు తేలిన 180 ప్రైవేట్ డీఎడ్ కాలేజీల గుర్తింపును
విద్యాశాఖ రద్దు చేసింది. 2018–20 బ్యాచ్‌కు సంబంధించి
అక్రమంగా చేపట్టిన ప్రవేశాలకు అనుమతులు నిరాకరించింది.
0 Komentar