Arthritis
symptoms home remedies
కీళ్ళనొప్పులు (arthritis)
ఆర్థరైటిస్ అనేది
కీళ్ళను ప్రభావితం చేసే రుగ్మతను అర్థం
చేసుకోవడానికి తరచుగా ఉపయోగించే పదం. ఆర్థరైటిస్ లక్షణాలు ఎరుపు, వెచ్చదనం,
వాపు మరియు ప్రభావిత కీళ్ల కదలిక తగ్గడం ఉండవచ్చు. కొన్ని రకాల
ఆర్థరైటిస్లలో ఇతర అవయవాలు కూడా ప్రభావితమవుతాయి. ప్రారంభం క్రమంగా లేదా
ఆకస్మికంగా ఉంటుంది. ఇది కొందరిలో తీవ్రంగా ఉంటే మరికొందరిలో తక్కువగా ఉంటుంది.
అయితే, నొప్పులు తీవ్రంగా ఉన్నప్పుడు శరీరం యొక్క సామర్థ్యం
మీద ప్రభావం చూపుతుంది.
ఆస్టియో
ఆర్థరైటిస్ సాధారణంగా వయస్సుతో సంభవిస్తుంది మరియు వేళ్ళు, మోకాళ్ళు
మరియు తుంటిని ప్రభావితం చేస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది తరచుగా చేతులు
మరియు కాళ్ళను ప్రభావితం చేస్తుంది. కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు, హోం ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కూడా ఉపశమనం పొందవచ్చు. హోం రెమెడీస్
తీసుకొన్న తర్వాత కూడా నొప్పి అలాగే బాధిస్తుంటే డాక్టర్ ను సంప్రదించడం మంచిది. రోజువారి
ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా కీళ్ళనొప్పుల నుండి
దూరంగా ఉండవచ్చు.
ఇంటిలో
పాటించవలసిన చిట్కాలు (remedies)
1. కాల్షియం, విటమిన్-D3 ఏక్కువగా
లభించే పదార్దాలు తీసుకోవడం ద్వారా వీటికి మనం దూరంగా ఉండవచ్చు.
2. తులసి ఆకులను నీటిలో మరిగించి పరగడుపున తాగడం వలన మంచి ఫలితం ఉంటుంది.
3. అవిశ గింజలు, వాల్ నట్స్, నువ్వులు
వంటివి కీళ్ళనొప్పుల నుండి ఉపశమనాన్నిస్తుంది.
4. కాళ్లలో నొప్పి ఉన్న చోట జింజర్ ఆయిల్ ను అప్లై చేసి మసాజ్ చేస్తే మంచి
ఫలితం ఉంటుంది.
5. మెంతులు రాత్రంతా నానబెట్టి తినడం వలన కీళ్ళనొప్పుల నుండి ఉపశమనం
పొందవచ్చు.
6. కాటన్ క్లాత్ లో ఐస్ ముక్కలు వేసి ఒక రోజులో రెండు మూడు సార్లు నొప్పి
ఉన్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల నొప్పి, సలుపును తగ్గించడంతో
పాటు వాపు మరియు ఇన్ ఫ్లమేషన్ తగ్గిస్తుంది.
7. ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఉపయోగం ఉంటుంది.
8. రోజులో రెండు మూడు సార్లు నొప్పి ఉన్న ప్రదేశంలో కొద్దిగా గోరువెచ్చని
ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె మరియు ఆవనూనె వేసి మసాజ్ చేస్తే మంచి ఫలితాలన్ని పొందవచ్చు.
9. రోజు ద్రాక్ష పండ్లను తినడం ద్వరా కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు
అని టెక్సాస్ యూనివర్సిటి వెల్లచించింది.
10. డైరీ ప్రోడక్ట్స్ తినడం ద్వారా
కాల్షియం లభిస్తుంది.
11. సోరోమాన్ ,మాక్రోల్ చేపలలో ఒమేగా-3 కీళ్ల నొప్పులకు దూరంగా ఉంచుతుంది.
12. గోరువెచ్చని నువ్వుల నూనెలో కొద్దిగా పసుపు వేసి పేస్ట్ లా చేసి కాలుకు
అప్లై చేసి మర్దన చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి
ఫలితం ఉంటుంది .
13. వేడి పాలలో కొద్దిగా పసుపు వేసుకొని త్రాగడం వల్ల కీళ్ళనొప్పులను
తగ్గించడంతో పాటు హీలింగ్ కు కూడా మంచి ఫలితం ఉంటుంది.
14. నీటిలో అన్ ఫిల్టర్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి కాళ్లను డిప్ చేసి అరగంట
పాటు అలాగే ఉంచితే కాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
15. కాళ్ళనొప్పికి మరియు మజిల్ సోర్ నెస్ కు ఉపశమనం కలిగించే వాటిలో టార్ట్
చెర్రీ జ్యూస్ ఉత్తమమైనది.
16. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రక్తప్రసరణను మెరుగుపరచి మరియు కండరాల
నొప్పి తగ్గిస్తుంది. కాళ్ళ నొప్పి ఉన్న చోట జింజర్ ఆయిల్ ను అప్లై చేసి మసాజ్
చేయాలి.
17. రోజూ ఉదయం ఎండలో ఉండటం వలన -D లభిస్తుంది, ఎముకలు బలంగా వుంటాయి.
18. పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. బంగాళదుంప, అరటిపండ్లు, ప్లమ్స్, ప్రూనేజ్యూస్,
మరియు టమోటో జ్యూస్ వంటివి తీసుకోవాలి.
19. మైదా పిండితో చేసిన ఆహరంకు దూరంగా
ఉండడం మంచిది.
0 Komentar