Benefits Of Fenugreek Seeds In Telugu
మెంతులు
మెంతులు వంటలకు ప్రత్యేకమైన ఫ్లేవర్, రుచిని అందిస్తాయి. మెంతి పొడిని
ఊరగాయల్లోనూ, మెంతి గింజలను చారు, పులుసు, పోపులోనూ వాడుతాం. జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెంతులు మంచి ఔషధం. చేదుగా ఉండే
మెంతుల వల్ల ఆరోగ్యపరంగా, సౌందర్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయి. గోధుమ పిండిలో మెంతుల పేస్ట్ లేదా మెంతికూర
ఆకులను కలిపి చపాతీ, పరోటాగా వేసుకొని తింటే రుచిగా ఉంటాయి. పీచుపదార్థం, ఐరన్, మాంగనీస్, కాపర్, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ బి6 పుష్కలంగా ఉంటాయి. మెంతులు నానబెట్టుకుని
సేవించడం వలన కూడ అనేక ప్రయోజనాలు కలవు.
మెంతుల వల్ల కలిగే ప్రయోజనాలు
>కాలేయ పనితీరును, జీర్ణ ప్రక్రియను
మెరుగుపరుస్తాయి.
>మెంతుల కషాయం, మెంతి కూరపప్పు
తిసుకోవడం వలనబాలింతలకు పాలు ఉత్పత్తి పెరుగుతుంది.
>ఎసిడిక్ రిప్లెక్షన్ మరియు హార్ట్
బర్న్ తగ్గిస్తుంది.
>అల్సర్, అజీర్తి సమస్యకు చక్కటి పరిష్కారం.
>మెంతుల్లో ఉన్న ఫైబర్ కంటెంట్ శరీరం
లోని టాక్సిన్స్ ను తగ్గించి శరీరాన్ని న్యూరిష్ చేస్తుంది. దాంతో కోలెన్ క్యాన్సర్ నుండి రక్షణ
కల్పిస్తుంది.
>జుట్టురాలే సమస్యను తగ్గించి,కుదుళ్లను
బలంగా మారుస్తుంది.
>రోజు గుప్పెడు మెంతి ఆకులను రోట్లో
మెత్తగా నూరి, ఆ పేస్టును ముఖంమీద వైట్హెడ్స్ అధికంగా ఉండే చోట బాగా అప్లయ్
చేసి రాత్రంతా అలాగే ఉంచుకుని ఉదయాన్నే లేచి గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేస్తే
కొన్ని రోజులకు వైట్హెడ్స్ బారినుంచి విముక్తి అవ్వచ్చు.
>ఆల్కహాల్ ప్రభావం వల్ల దెబ్బతిన్న
కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి. మూత్రపిండాల్లోని కణాలు క్షీణించకుండా కాపాడతాయి.
>పెరుగు, మెంతుల మిశ్రమంతో తయారుచేసిన ఫేస్ ప్యాక్
వేసుకోవడం ద్వారా చర్మం ముడతలు పడకుండా, గీతలు ఏర్పడకుండా ఉంటాయి.ఎప్పటికీ యవ్వనంగా
కనిపిస్తారు.
>పీరియడ్స్ సమయంలో వచ్చే తలనొప్పి, వికారం, ఇతర సమస్యలను
మెంతులు తగ్గిస్తాయి.
>డార్క్ సర్కిల్స్, మొటిమలను తగ్గిస్తుంది. మెంతుల్లో
ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఆర్థరైటిస్ తో బాధపడుతున్న వారికి కీళ్ల
నొప్పులు తగ్గించి ఉపశమనాన్ని అందిస్తాయి.
>రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోవడమే
కాకుండా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
>లివర్ పనితీరు మెరుగు పడుతుంది.
>శరీరంలో మెటబాలిజం ప్రక్రియను మెరుగు
పరుస్తాయి.
>గాయాలు, పుండ్లతో ఇబ్బందిపడేవారు మెంతిపొడి
పేస్టులా చేసిఆ భాగంలో రాయాలి.
>మెంతులను రోజూ తినడం వల్ల శరరీంలో
ఉండే చెడు కొలెస్ట్రాల్ పోతుంది.అధిక బరువు >తగ్గుతారు.మలబద్దకం దూరమవుతుంది.
>మెంతి ఆకులను మిక్సీ పట్టి ఓ రెండు
చెంచాల నిమ్మరసం కలిపి తలకు పెట్టుకుని అరగంట
తరువాత స్నానం చేస్తే జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది.
>పార్కిన్సన్, అల్జీమర్స్
వంటి వ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి.
>రుతు సమస్యలు, గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్లు
సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
>వేయించిన మెంతిపొడిని 1-2 చెంచాలు మజ్జిగతో
తీసుకుంటె నీళ్ల విరేచనాలు, రక్త విరేచనాలు తగ్గుతాయి.
>మెంతులు వేసి మరగబెట్టిన నీటిలో
నిమ్మరసం, తేనె కలిపి తాగితే జ్వరం తగ్గుముఖం పడుతుంది.
>మగవారు మెంతులను తీసుకుంటే శృంగారంపై
ఆసక్తి పెరుగుతుంది.
>గ్లాక్టోమనన్ అనే మూలకం రక్తంలో
షుగర్ స్థాయులను ,అమైనో ఆమ్లాలు ఇన్సులిన్ స్థాయులను క్రమబద్ధీకరిస్తాయి.
మెంతుల వలన కలిగే దుష్ప్రభావాలు
మెంతుల
వలన ఆరోగ్య ప్రయోజనాలతో పాటు దుష్ప్రభావాలు కూడా
ఉన్నాయి. అనారోగ్యంతో భాదపడే వారు వైద్యున్ని సంప్రదించి వాడితే మంచిది. అలాగే
>గర్భధారణ సమయంలో
మెంతుల ఉపయోగించకూడదు, ఎందుకంటే పిండంలో మార్పులు లేదా వైకల్యాలు
ఏర్పడవచ్చు.
>ఆహారంలో దాని
ఉపయోగం కాకుండా, ఔషధ పరంగా మెంతులను 6 నెలల కంటే ఎక్కువ కాలం
ఉపయోగించరాదు.
>పిల్లలలు మెంతులు
తినరాదు, ముఖ్యంగా మెంతి విత్తనాలను ప్రత్యక్షంగా తినరాదు.
0 Komentar