వేరుశనగలను కొన్ని ప్రాంతాల్లో
పల్లీలు అని కూడా అంటారు. రోజుకో గుప్పెడు పల్లీలు తినండి.. ఆరోగ్యంగా
ఉండండి.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేరుశనగ గింజల తొక్కల్లో కూడా ఆరోగ్యాన్ని పెంచే, రోజువారీ
అవసరమయ్యే చాలా పోషకాలున్నాయి. బ్లూబెర్రీ పండ్లలో కంటే వేపిన వేరుశనగ తొక్కల్లోనే
విష వ్యర్థాల్ని అడ్డుకునే గుణాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది.
వేరుశనగలో లభించే పోషక పదార్ధాలు
> పల్లీల్లో
బోలెడన్ని పోషకాలు దాగివున్నాయని న్యూట్రీషన్లు అంటున్నారు. ఇందులో ఎక్కువగా మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా
ఉంటాయి.
> శరీరంలో అన్ని జీవక్రియలను నియంత్రించడానికి
అవసరం అయ్యే విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా కలిగి ఉన్నాయి.
> పల్లీల్లో
మోనోశాచురేటెడ్ కొవ్వుల కారణంగా వీటిని మోతాదుకు మించకుండా తినడం వల్ల గుండెజబ్బులను 20% వరకూ
తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
> శరీరానికి
మేలుచేసే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువ.
> విటమిన్ ఇ, నియాసిన్, ప్రోటీన్, మాంగనీసు
వేరుశెనగల్లో అధికం. అలాగే అమినో యాసిడ్స్ కూడా ఎక్కువ.
> ప్రతి 100గ్రాముల వేరుశెనగల్లో 8 గ్రాముల విటమిన్ 'ఇ' ఉంటుంది.
> మన రోజువారీ
అవసరాలకు కావాల్సిన 86 శాతం నియాసిన్ను పల్లీలే అందిస్తాయి.
రోజు పల్లీలు
(గుప్పెడు) తినడం వలన ప్రయోజనాలు
> యాంటీఆక్సిడెంట్స్
గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తే, ఇందులో ఉండే ప్రోటీనలు కణాలు, కణజాల మర్మత్తులు
చేసి కొత్త కణాలు ఏర్పడేలా చేస్తుంది. ఫ్రీరాడికల్స్ ఏర్పడకుండా కాపాడుతుంది.
> వేరుశెనగలో
ప్రోటీన్లు అధికంగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు వీటిని మంచి పోషకాలుగా అందించవచ్చు. ఫలితంగా పిల్లల్లో
ఎదుగుదల బాగుంటుంది.
> అలాగే వీటిలో
ఉండే ఆమ్లాలు పొట్టలో క్యాన్సర్ కారకాలు పేరుకోకుండా వాటిని అదుపులో ఉంచుతాయి.
>వేరుశెనగలోని
అన్ శాచురేటెడ్ ఫ్యాట్ మీ గుండెను ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది.వేరుశెనగపప్పులు
వారంలో రెండు సార్లు కొద్ది కొద్దిగా తింటుంటే హార్ట్ స్ట్రోక్ మరియు కరోనరీ హార్ట్
డిసీజ్ ను తగ్గిస్తుంది.
> వేరుశెనగలు
మన శరీర ఆరోగ్యం మీద బహుముఖంగా పనిచేస్తుంది. పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది
మరియు ఉన్న రాళ్ళు అభివ్రుద్ది చెందకుండా కాపాడుతుంది.
>వేరుశెనగపప్పులోని
అవసరం అయ్యే అమినో యాసిడ్స్ మెదుడు నాడీకణాలకు సంబంధించిన కెరోటినిన్ ఉత్పత్తి చేస్తుంది. అది మన మెదడు
సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది.
> వేరుశెనగపప్పులో
ఉండే అధిక న్యూట్రీయంట్స్ చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడంలో ప్రధాన పాత్రపోషిస్తుంది. అలాగే మంచి
కొలెస్ట్రాల్ ను పెంచడంలో గొప్పగా సహాయపడుతుంది.
> పల్లీల్లోని
ఫ్యాట్ శక్తిగా మార్పు చెందుతుంది మరియు మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. మానవ శరీరంలో
జీవక్రియలన్నీ ఆరోగ్యంగా జరగడానికి ఇది బాగా సహాయపడుతుంది.
> పల్లీల్లోని
కేల్షియమ్, విటమిన్-డి లు ఎముకపుష్టికి దోహదపడతాయి.
>వేరుశెనగలో
విటమిన్ బి మెదడు పనితీరును మెరుగుపరచడానికి మరియు జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
>పల్లీలలో ఉండే
రెస్‌వెట్రాల్ అనే పాలిఫినాలిక్ యాంటీ ఆక్సిడెంటుకు క్యాన్సర్లు, గుండెజబ్బులు,
నరాలకు సంబంధించిన వ్యాధులు, అల్జీమర్స్,
వైరల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేసే శక్తి వుంటుంది.
0 Komentar