Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Best foods for eye health and eyesight

Best foods for eye health and eyesight
కంటి చూపు మెరుగుపరిచే ఆహారాలు
వయసు పైబడడం లేదా కొన్ని ఆనారోగ్య పరిస్థితుల కారణంగా కంటి చూపు క్షీణిస్తుంది. అయినప్పటికీ, అద్దాల అవసరం లేకుండా ఒక వ్యక్తి వారి దృష్టిని రక్షించుకోవడానికి మరియు మెరుగుపరచడానికి అనేక సహజ మార్గాలు ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్- అధికంగా ఉండే సమతుల్య మరియుఆరోగ్యకరమైన ఆహారం తినండి. తగినంత నిద్ర పొందండి. సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం మికళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా కీలకం, మరియు కంటి పరిస్థితులను మెరుగు పరచి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు అని పిలువబడే విటమిన్లు, పోషకాలు మరియు ఖనిజాలను కలిగి ఉన్న ఆహారాన్ని మీరు చేర్చుకుంటే తీవ్రమైన కంటి సమస్యలను కొంతవరకు నివారించవచ్చు.
కంటిచూపుని పెంచే ఆహార పదార్థాలు
1.ఆకు కూరలలో ఉండే లూటిన్, సెల్ డ్యామేజ్  మరియు మస్కులార్ డిజనరేషన్, కాటరాక్ట్స్ రాకుండా ఆపవచ్చు.
2.క్యారెట్స్ లోని విటమిన్-, సి, లూటెన్, జియాక్సిథిన్ కాటరాక్ట్, మస్కులర్ డిజనరేషన్, రేచీకటి మొదలగు కళ్ళ వ్యాధులు రాకుండా రక్షణగా ఉంటుంది.
3.చేపల్లో డి.హెచ్. అనే ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వలన సెల్ డ్యామేజ్ లేకుండా చూసి మాక్యూలర్ డిజనరేషన్ జరగకుండా సహాయపడుతుంది.
4.పాలు మరియు పాల ఉత్పత్తులలో విటమిన్-, జింక్ ఖనిజం ఉంటాయి.విటమిన్ కార్నియాను రక్షిస్తుంది,జింక్ రాత్రి సమయంలో దృష్టిని మెరుగుపరచడంతో పాటు కంటిశుక్లం నివారణకు కూడా సహాయపడుతుంది.
5.గుడ్లులో ఒమేగా 3ఫ్యాటీ ఆసిడ్స్, డిహెచ్ , ల్యూటిన్ మరియు జియాక్సిథిన్ కళ్ళకి చాలా మంచివి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇవి తినే ముందు డాక్టర్ ని అడగటం మంచిది. 6.నట్స్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్- అధికంగా ఉంటాయి. ఇవి వాపును తగ్గించి కంటి ఆరోగ్యాన్ని, కార్డియో వాస్కులర్ ఆరోగ్యాన్నీ కాపాడుతాయి.
7.బీన్స్ తో  కంటి చూపు మెరుగుపడుతుంది. ఇవి జింక్ మరియు బయోఫ్లేవినోయిడ్ల (bioflavonoids) యొక్క గొప్ప వనరులు,
8.కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మీ ఆహారంలో రాజ్మా గింజలు, పెసలు, అలసందలు, ఉలవలు, పచ్చి బఠానీలు, శనగలు మరియు మొలకలు తగినంత మొత్తంలో ఉండాలి.
9.బీట్ రూట్ మరియు చిలగడదుంప రెండూ కంటి వాపును తగ్గించడానికి మరియు టాక్సిన్స్ ను బయటకు తొలగించడానికి సహాయపడతాయి.
10.సిట్రస్ పండ్లలో విటమిన్ సి పోషకాలు అధికంగా ఉండి కంటి కండరాలను డీజనరేషన్ ఆపేందుకు సహాయం చేస్తుంది.
11.గుమ్మడికాయలో జియాథిన్ అధికశాతంలో ఉండటం వల్ల ఇది ఆప్టికల్ ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరం.
12.వెల్లుల్లి, ఉల్లిపాయలో అధిక శాతంలో సల్ఫర్ గ్లూటథియొనో ఉత్పత్తి చేసే యాంటిఆక్సిండెంట్స్ కంటి చూపుకు చాలా ఉపయోగకరం.
13.ద్రాక్షలో ఆంథోసైనిన్ అధికంగా ఉండి, రాత్రిల్లో కంటి చూపును స్టాంగ్ గా ఉండేలా చేస్తుంది.
14.బొప్పాయిలోని యాంటీఆక్సిడెంట్, బీటా-కార్టోయిన్ ఆరోగ్యకరమైన కళ్ళు మరియు దృష్టికి సహాయపడుతుంది.
15.వ్యాయామాలు  కంటి కణాలను పునర్నిర్మించడానికి మరియు అరిగిపోకుండా ఉండడానికి  సహాయపడతాయి తద్వారా కళ్ళ యొక్క పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపడుతుంది.
16.సన్ గ్లాసెస్ కేవలం ఫ్యాషన్ అనుబంధం కాదు, అవి అతినీలలోహిత (యువి) కాంతి నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడతాయి.
17.బెర్రీస్ లో ఉన్న ఫ్లెవనాయిడ్స్, నేచురల్ యాంటీయాక్సిండెస్ కళ్ళును సురక్షితంగా ఉంచేందుకు ఉపయోగపడుతాయి.
Previous
Next Post »
0 Komentar

Google Tags