Bike and Car on
road prices to go down
తగ్గనున్న బైకులు, కార్ల ధరలు
-బైక్ లేదా కారులకు
ఏ ఏటికాయేడే బీమా!
-ఒకేసారి 3, 5 ఏళ్ల బీమా నుంచి ఉపశమనం
కార్లు, టూవీలర్ల
ధరలు భారీగా దిగిరానున్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ తాజా నిర్ణయంతో ఆగస్టు
1 నుంచి కొత్తగా కొనుగోలు చేసే బైకులు, కార్ల ధరలు తగ్గనున్నాయి. వీటి కొనుగోలు సమయంలో చెల్లించాల్సిన
ఇన్సూరెన్స్‌ను ఇక ఏడాది వరకు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక
ఇన్సూరెన్స్ ప్యాకేజీలను తొలగిస్తున్నట్లు ఐఆర్‌డీఏఐ తెలిపింది. కరోనా సమయంలో
వాహన విక్రయాలు పడిపోతున్న నేపథ్యంలో ఐఆర్‌డీఏఐ తీసుకున్న ఈ నిర్ణయంతో సేల్స్
పెరుగుతాయని వాహన డీలర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు
ఎవరైనా ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేస్తే తొలి ఏడాది పూర్తి స్థాయి బీమా, మిగిలిన
నాలుగేళ్లకు థర్డ్ పార్టీ బీమా ప్రీమియం ఒకేసారి చెల్లిస్తున్నారు. కార్లకు తొలి
ఏడాది పూర్తి బీమాతోపాటు మరో రెండేళ్లకు థర్డ్ పార్టీ ప్రీమియం
కట్టించుకుంటున్నారు. అంటే, ఇన్సూరెన్స్ ప్రీమియం రూపంలో టూవీలర్లకు రూ.8,000 దాకా, కార్లకు రూ.40,000 దాకా
భారం భరించాల్సి వస్తోంది.
good information...big relief to buyers..
ReplyDelete