CBSE to reduce
syllabus by 30% for classes 9-12
9-12 తరగతులకు CBSE సిలబస్ 30% కుదింపు
లాక్ డౌన్ కారణంగా విద్యా
సంవ త్సరం ప్రారంభంలో జాప్యం అవుతుండటంతో సిలబస్ ను కుదించాలని సీబీఎస్ఈ
నిర్ణయించింది. విద్యార్థులు ఈ ఏడాది వెనకబడకుండా ఉండేందుకు అనుగుణంగా సిలబస్‌లో
మార్పులు చేసుకునేందుకు కేంద్రం అనుమతించింది. ఈ నేపథ్యంలోనే 2020-21 విద్యా సంవత్సరంలో 9 నుంచి 12వ తరగతులకు 30 శాతం
సిలబస్ కట్ చేస్తున్నట్లు CBSE అధికారికంగా తెలిపింది. దీని
వల్ల విద్యార్థుల మీద ఒత్తిడి తగ్గడమే కాకుండా విద్యా సంవత్సరానికి కూడా ఎలాంటి
ఇబ్బంది ఉండదంది. ఇక మార్పులతో కూడిన సిలబస్‌ను సర్క్యులమ్ కమిటీ ఫైనల్ చేసిందని..
సిలబస్‌లో లేని పాఠాలు కేవలం విద్యార్థులకు బోధించడమే తప్పితే.. వాటిపై
అసైన్మెంట్స్, బోర్డు పరీక్షల్లో ప్రశ్నలు ఇవ్వమని సీబీఎస్ఈ
స్పష్టం చేసింది. 1-8 తరగతులకు ఎస్సీఈఆర్టీ సూచించిన
ప్రత్యామ్నాయ సిలబస్ ఉంటుంది.
0 Komentar