Center
directives on continuing education of children of migrant workers
వలస కార్మికుల
పిల్లల చదువు కొనసాగింపు విషయంలో కేంద్రం కీలక ఆదేశాలు
టీసీ, గత
తరగతుల రుజువు అడగొద్దు
కరోనా కారణంగా సొంతూళ్లకు
తిరిగి వెళ్తున్న వలస కార్మికుల పిల్లల చదువు కొనసాగింపు విషయంలో కేంద్రం కీలకమైన
ఆదేశాలిచ్చింది. ఇలాంటి విద్యార్థుల పేర్లను పాఠశాలల రికార్డుల నుంచి
తొలగించవద్దని, తాత్కాలికంగా అందుబాటులో లేరని మాత్రమే నమోదు చేయాలని కోరింది.
పరిస్థితులు మెరుగయ్యాక వారు తిరిగొచ్చే అవకాశం ఉండడంతో ఈ సూచన చేసింది. అలాగే
సొంతూళ్లకు వచ్చిన పిల్లలకు ఒక్క గుర్తింపు రుజువు మినహా ఎలాంటి ధ్రువపత్రాలు
లేకుండానే స్థానిక పాఠశాలల్లో చేర్చుకొనేలా రాష్ట్రాలు ఆదేశాలు ఇవ్వొచ్చని
పేర్కొంది. టీసీ, గతంలో చదివిన తరగతుల రుజువులు వంటివి అడగకుండా..
తల్లి దండ్రులు ఇచ్చిన సమాచారం సరైనదేనని భావించి సంబంధిత తరగతిలో చేర్చుకోవాలని
నిర్దేశించింది.
0 Komentar