రిటైరైన కేంద్ర
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రొవిజినల్ పెన్షన్
రిటైర్ అయిన
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ వచ్చేలోపు ‘ప్రొవిజినల్
పెన్షన్’, ‘ప్రొవిజినల్ గ్రాట్యుటీ’ ఇవ్వనున్నట్టు కేంద్ర
ప్రభుత్వం ప్రకటించింది. వారికిపెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీఓ) అందేవరకు ఇదే
విధానం కొనసాగనుంది. తొలుత 6 నెలల వరకు ప్రొవిజినల్ పెన్షన్ ఇచ్చి అవసరమైతే దానిని
ఏడాది వరకు పెంచే వీలు కూడా ఉంది. అన్ని రిటైర్మెంట్లకు ఇది వర్తిస్తుంది.
కోవిడ్ మహమ్మారి, లాక్
డౌన్ కారణంగా, పెన్షన్ ఫోర్మ్స్ ని ప్రధాన కార్యాలయానికి పంపించడమూ,
సర్వీసు రికార్డులను పే అండ్ ఎకౌంట్స్ కార్యాలయాలకు సకాలంలో అందించడమూ,
ప్రభుత్వ ఉద్యోగులకు కష్టంతో కూడుకున్న పని కనుక, ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సిబ్బంది, వ్యవహారాల
మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. కేంద్ర
కార్యాలయాలు ఒకచోట, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలు ఒకచోట
ఉండడంతో పత్రాలు పంపడంలో కేంద్ర సాయుధ పోలీసు దళాల సిబ్బందికి ఎక్కువగా ఇబ్బందులు
ఉన్నాయని తెలిపారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ రోజునే పీపీఓని అందించేలా
డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ విభాగాన్ని సంసిద్ధం
చేశామని తెలిపారు.
0 Komentar