"నాడు - నేడు" పాఠశాలలకు సీఎం గారు ఆమోదించిన కలర్ ప్యాటరన్
‘నాడు
– నేడు’ మరియు ఇతర ప్రాజెక్టులపై
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
రాష్ట్ర
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు, సాగునీటి
ప్రాజెక్టులు, వాటర్‌గ్రిడ్, మౌలిక
సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు నిధుల అనుసంధానంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్
గురువారం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అత్యంత
ప్రాధాన్యతగా భావిస్తున్న వీటి విషయంలో ఎక్కడా నిధులకు కొరత రాకుండా పటిష్ట
ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు.
అలాగే
విద్యారంగంలో నాడు-నేడు పనులకు ఇప్పటి వరకు విడుదల చేసిన నిధులు, ఇకపై
సమీకరించాల్సిన నిధుల అంశాలపై సీఎం అధికారులకు మార్గనిర్దేశం చేశారు. మొదటి విడత
నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా 15
వేలకు పైగా స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, దీని
కోసం దాదాపు రూ.3600 కోట్లు ఖర్చు అవుతుందని, ఇప్పటికి రూ.920 కోట్లు విడుదలయ్యాయని వెల్లడించారు.
మిగిలిన నిధుల విడుదల కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆగస్టు 15 నాటికి మొదటి విడత నాడు–నేడు
కార్యక్రమాలకు మిగిలిన నిధులు ఇచ్చేందుకు ప్రణాళిక వేసుకోవాలన్నారు. అలాగే
పాఠశాలలు సహా, హాస్టళ్లు, జూనియర్,
డిగ్రీ కళాశాలల్లో రెండు, మూడో విడత నాడు–నేడు కార్యక్రమాల కోసం రూ.7700 కోట్లు ఖర్చు
అవుతాయని అంచనా వేశామని అధికారులు సీఎంకు తెలిపారు.
ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్న
పాఠశాలలు, ఆస్పత్రుల్లో నాడు–నేడు
కార్యక్రమాలకు.. నిధుల పరంగా ఇబ్బందులు రాకుండా, పటిష్టంగా ఈ
కార్యక్రమం కొనసాగాలని వైఎస్ జగన్ ఆదేశించారు. ఏడాదిన్నర కాలంలో పాఠశాలల
అభివృద్ధి విషయంలో మనం కన్న కలలు నిజం కావాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
విద్యారంగంలో నాడు-నేడు పనులపై తాము కన్న కల నిజం కావాలని అధికారులకు ముఖ్యమంతి
సూచించారు. ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో కూడా నాడు-నేడు,
కొత్తగా నిర్మించే నిర్మాణాలు అత్యంత ముఖ్యమైనదన్నారు. అక్టోబర్ 1 నుంచి రాయలసీమ కరువు నివారణా పనులు ప్రారంభించాలని సీఎం అధికారులను
ఆదేశించారు.
0 Komentar