Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Community Spread of COVID-19 Has Started in India

Community Spread of COVID-19 Has Started in India

దేశంలో కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి మొదలైంది: IMA
దిల్లీ: మన దేశంలో కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి మొదలైందని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌’ (ఐఎంఏ) పేర్కొంది. దేశంలో ప్రతి రోజూ 30వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ముఖ్యంగా ఈ వైరస్‌ గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. ఇది 'సామాజిక వ్యాప్తికి సంకేతం' అని ఐఎంఏ హాస్పిటల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా చైర్‌పర్సన్‌ డాక్టర్‌ వీకే మోంగా అన్నారు. పట్టణాలు, గ్రామాల్లోకి వేగంగా చొచ్చుకుపోతున్న వైరస్‌ను అదుపు చేయడం చాలా కష్టమైన విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి అప్రమత్తంగా ఉంటూ కేంద్ర సాయాన్ని తీసుకోవాలని చెప్పారు.
వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరల్‌ వ్యాధిని కట్టడి చేయడానికి రెండే మార్గాలున్నాయి. ఒకటి, ఈ వ్యాధి సోకిన 70 శాతం మంది రోగ నిరోధకశక్తిని పెంచుకోవడం, మిగతా 30 శాతం మందికి రోగ నిరోధక శక్తిని కల్పించడం రెండోది, టీకాల ద్వారా వ్యాధి నిరోధకత సాధించడం అని డాక్టర్‌ మోంగా తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags