Corona disease
myths vs. facts
కరోనా లక్షణాలపై
వదంతులు - వాస్తవాలు
అపోహ: దగ్గు, తుమ్ములు,
ముక్కుకారుతూ ఉంటే అది కరోనా సోకినట్లేనా ? వెంటనే
హాస్పిటల్‌కు వెళ్లాల్సిందేనా?
వాస్తవం: దగ్గు, తుమ్ములు,
ముక్కుకారడం వంటి లక్షణాలు ఉంటే మరీ అంతగా భయపడాల్సిన అవసరం లేదు.
అందుకు చాలా కారణాలు ఉండొచ్చు. ఉదాహరణకు మనకు దగ్గు, తుమ్ములతో
పాటు ముక్కు కారడం అనేది బయటి వాతావరణంలో ఏవైనా కాలుష్య కణాలు ముక్కులోకి వెళ్లడం
వల్ల ఉండొచ్చు. ఒకవేళ దగ్గు, తుమ్ములూ, ఒళ్లునొప్పులు, తీవ్రమైన నిస్సత్తువ/ నీరసంతో పాటు 101.5 లేదా 102 డిగ్రీల ఫారెనిన్ హీట్ ఉష్ణోగ్రతతో జ్వరం
ఉండి, ఊపిరి అందకుండా ఆయాసం వస్తుంటే వెంటనే వైద్యులను
సంప్రదించాలి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే, కుటుంబ సభ్యుల
నుంచి దూరంగా ఉంటూ, మీ వస్తువులను ఎవరూ వాడకుండా చూసుకుంటూ,
ఇంట్లోనే ఐసోలేషన్ పాటించాలి. బయటకు ఏమాత్రం రాకూడదు. అప్రమత్తతంగా
ఉండాలి కానీ, ఆం దోళన చెందాల్సిన అవసరం లేదు.
అపోహ: కరోనా
వైరస్ సోకితే మనిషి చనిపోతాడు?
వాస్తవం : లేదు.
ఈ వైరస్ వల్ల సంభవించే మరణాలు రేటు కేవలం 2 నుంచి 3శాతం మాత్రమే. దాదాపు 80శాతం మంది తేలికపాటి
లక్షణాలు కలిగి రెండు వారాల్లోనే కోలుకుంటారు. కేవలం వృద్ధులు (60ఏళ్లకు పైబడ్డవారు), అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న
వారికి వైరస్ సోకితే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.
అపోహ: కరోనా
వైరస్ వేడి ప్రాంతంలో ఉన్న వారికి సంక్రమించదు.
వాస్తవం : కరోనా
వైరస్ వేడి ప్రాంతంలో ఉన్న వారికి సంక్రమించదు అనేది అపోహ మాత్రమే. ఈ వైరస్
వాతావరణం తో సంబంధం లేకుండా తిష్టవేసి ఒకరినుంచి ఇంకొకరికి సోకుతుంది. వ్యక్తిగత
పరిశుభ్రత పాటిస్తూ మాత్రమే వైరసన్ను ఎదుర్కోగలం. వేడినీళ్లతో స్నానం చేస్తే వైరస్
అంతరిస్తుందనేది అపోహ మాత్రమే.
అపోహ: థర్మల్
స్కానర్స్ ద్వారా కరోనా వైరస్ ను గుర్తించవచ్చు.
వాస్తవం: ధర్మల్
స్కానర్స్ ద్వారా కరోనా వైరస్ ను గుర్తించవచ్చు అనేది అవాస్తవం. ధర్మల్ స్కానర్స్
మనిషి ఒంటిలో జ్వరాన్ని మాత్రమే గుర్తిస్తుంది. కరోనా వైరస్ కి ఉన్న లక్షణాలలో అతి
ముఖ్యమైనది జ్వరం కాబట్టి అనేక చోట్ల థర్మల్ స్కానర్స్ ని వాడుతున్నారు. కరోనా
వైరస్ లక్షణాలు బయటపడాలి అంటే వ్యాధి సోకిన రోజు నుంచి సుమారు 14
రోజుల సమయం పడుతుంది.
అపోహ : శానిటైజర్
పూసుకుని వంటింట్లో స్టవ్ దగ్గరకు వెళ్ల కూడదు. వెళ్లే చేతులు కాలిపోయే ప్రమాదం
ఉంటుంది.
వాస్తవం:
శానిటైజర్ లో ఆల్కహాల్ శాతం దాదాపు 70 నుంచి 80 శాతం వరకు ఉంటుంది. ఆల్కహాలకు చాలా త్వరగా ఆవిరై, ఆరిపోయే
గుణం ఉంటుంది. అందువల్ల ఆరిపోగానే ఎలాంటి అనుమానాలూ పెట్టుకోకుండా వంట చేసుకోవచ్చు.
అపోహ: ముక్కును
నిరంతరం సెలైన్ తో శుభ్రం చేసుకుంటే కరోనా వైరస్ నుంచి రక్షణ పొందగలమా..?
వాస్తవం: ఇది
నిజం కాదు. నిరంతరం సెలైన్ తో ముక్కును శుభ్రం చేసుకుంటే కరోనా వ్యాప్తి చెందదు
అనేదానికి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే జలుబు వచ్చినప్పుడు ముక్కును క్రమం తప్పకుండా
శుభ్రం చేసుకుంటే ఉపశమనం పొందవచ్చనడానికి పరిమిత ఆధారాలు మాత్రమే ఉన్నాయి.
అపోహ: మనం రోజూ
అల్లం,
వెల్లుల్లి, ఉల్లి, నిమ్మజాతికి
చెందిన పండ్లు తింటే ఈ జబ్బు దరిచేరదు.
వాస్తవం: అల్లం, వెల్లుల్లి,
ఉల్లి విషయానికి వస్తే వీటిల్లో చాలా ఔషధ గుణాలున్నమాట నిజమే. అలాగే
నిమ్మజాతి పండ్లలోని విటమిన్ 'సి' వల్ల
వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అంతమాత్రాన వీటిని తీసుకుంటే కరోనా వైరస్ రాదు
అన్నది పూర్తి వాస్తవం కాదు. మనలో వ్యాధి నిరోధక శక్తి ద్వారా పరోక్షంగా మాత్రమే
వ్యాధిని నిలువరించేందుకు దోహదపడతాయి. ఇవి తీసుకున్నంత మాత్రాన జాగ్రత్తగా ఉండకపోతే...
వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే వంటింటి చిట్కా వైద్యాలపై ఆధారపడి నిర్ల
క్ష్యంగా ఉండకూడదు.
కరోనా వ్యాధి
అపోహలు-వాస్తవాలు
0 Komentar