Corona is not
spread by mosquitoes
దోమల ద్వారా కరోనా
వ్యాప్తి చెందదు
కొవిడ్-19
వ్యాధి దోమల ద్వారా వ్యాప్తి చెందదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెవో) ఇప్పటికే
ప్రకటించగా ఆ వాదనను తాజాగా శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. కొవిడ్-19కు కారణమవుతున్న సార్స్ కొవ్-2 వైరస్ మనుషుల్లో దోమల
ద్వారా సోకదని మొదటిసారిగా ధ్రువీకరించారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్) ఇప్పటికే చేసిన ఈ తరహా ప్రకటనకు శాస్త్రీయ ఆధారం
లభించినట్లయింది.
అమెరికాలోని
కన్సాస్ స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. దోమల్లో విస్తృతంగా
వ్యాప్తిలో ఉన్న ఏడెస్ ఈజిప్షి, ఏడెస్ ఆల్బోపిక్టస్, క్యులెక్స్ క్విన్ క్వెఫాసియాటస్ జాతుల్లో కరోనా వైరస్ తన ప్రతులను
ఉత్పత్తి చేసుకోలేదని తేలినట్లు పరిశోధనకు నాయకత్వం వహించిన స్టీఫెన్ హిగ్స్
చెప్పారు. అందువల్ల, ఈ జీవుల ద్వారా మానవుల్లోకి కరోనా వైరస్
వ్యాప్తి చెందదని నిర్ధారణ అయినట్లు తెలిపారు. వైరస్ సోకిన వ్యక్తి నుంచి
రక్తాన్ని పీల్చినప్పటికీ ఈ రకం దోమలు ఆరోగ్యవంతుడికి ఈ వ్యాధిని వ్యాప్తి చేయలేక
పోయాయని గుర్తించామని వివరించారు. ఈ పరిశోధన ఫలితాలు జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్ లో
ప్రచురితమయ్యాయి.
0 Komentar