ఉమ్మడి ప్రవేశ
పరీక్షల (సెట్స్) దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం
ఉమ్మడి ప్రవేశ
పరీక్షల (సెట్స్) ఆన్‌లైన్ దరఖాస్తు చేసేటప్పుడు ఏవైనా తప్పులు దొర్లిఉంటే వాటిని
సరిచేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి స్పెషల్
ఆఫీసర్ (సెట్స్) డాక్టర్ ఎం.సుధీర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రవేశ పరీక్షల పేర్లు
వాటి సవరణ కు కేటాయించిన తేదీలు
>ఎంసెట్ దరఖాస్తుల్లో ఈ నెల 4 నుంచి 7 వరకు,
>ఈసెట్‌లో 7 నుంచి 10 వరకు,
>లాసెట్‌లో 7 నుంచి 10 వరకు,
>ఎడ్‌సెట్‌లో 7 నుంచి 10 వరకు,
>ఐసెట్‌లో 10 నుంచి 13 వరకు,
>పీజీఈసెట్‌లో 10 నుంచి 13 వరకు,
>పీఈసెట్ దరఖాస్తుల్లో 15 నుంచి 18 వరకు
ఆలస్య రుసుముతో
దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం
నిర్దేశిత గడువు ముగిసే
సరికి ఎంసెట్‌కు 2,71,598 దరఖాస్తులు రాగా అందులో ఇంజనీరింగ్‌కు 1,84,296 దరఖాస్తులు, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌కు 87,302 దరఖాస్తులు ఉన్నాయని సుధీర్ రెడ్డి తెలిపారు. ఆలస్య రుసుముతో దరఖాస్తు
చేసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.
Official website
0 Komentar