కరోనాకు ఆక్స్‌ఫర్డ్
వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ విజయవంతం
-18-55 ఏళ్ల
వయస్సు ఉన్న 1,107 మందిపై చేపట్టిన క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైందని
ప్రకటన
ఆక్స్‌ఫర్డ్
యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వాక్సిన్ సైతం విజయవంతగా హ్యూమన్ ట్రయల్స్‌ను పూర్తి
చేసింది. తమ పరిశోధనల్లో అద్భుత ఫలితాలు వచ్చాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వ్యాక్సిన్
హ్యూమన్ ట్రయల్స్ రిజల్ట్స్‌ను ప్రముఖ మెడికల్ జర్నల్ 'ది
లాన్సెట్'లో ప్రచురించారు. రెండు దశల మావన ప్రయోగాలకు
సంబంధించిన పరిశోధనాల ఫలితాలను అందులో పొందుపరిచారు. తాము అభివృద్ధి చేసిన ChAdOx1 nCoV-19 వాక్సిన్‌తో రోగ నిరోధక శక్తి పెరిగిందని
శాస్త్రవేత్తలు తెలిపారు.
ఆక్స్‌ఫర్డ్
కొవిడ్-19 వ్యాక్సిన్ 1/2 దశల ప్రయోగ ఫలితాలు ఇప్పుడు
ప్రచురించాం. వ్యాక్సిన్ సురక్షితం. చక్కగా సహిస్తోంది. రోగనిరోధక శక్తిని
చైతన్యం చేసింది. రూపకర్తలైన పెడ్రో ఫొల్‌గట్టి, సహచరులకు
అభినందనలు. ఈ ఫలితాలు ఆశాజనంగా ఉన్నాయి’ అని రిచర్డ్
ట్వీట్ చేశారు.
0 Komentar