CSE discussed on Teachers Transfers with all Recognised Teachers Associations
విద్యాశాఖ ముఖ్య
కార్యదర్శి బి.రాజశేఖర్ గారు, కమిషనరు చినవీరభద్రుడు గారు మరియు
ఉన్నత విద్యాశాఖ అధికారులతో ఉపాధ్యాయ సంఘాల నేతల భేటీ లోని వివరాలు
ఉపాధ్యాయుల HRA విషయంలో చర్చ లో వచ్చిన విషయాలు...
ఉపాధ్యాయుల HRA విషయంలో జరిగిన విషయం.. ఉపాధ్యాయులు రవాణా సౌకర్యం లేక దూర ప్రాంతాల
నుండి పాఠశాలలకు వెళ్ళలేకపోతున్నారని సంఘ నాయకులు చెప్పారు. అయితే పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి గారు పనిచేసే
ప్రాంతాల్లోనే ఉండాలి కదా అంత దూరంలో
ఎందుకు ఉంటున్నారు, మిగిలిన ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారు కదా పనిచేసే
ప్రాంతంలో లేనప్పుడు HRA ఎందుకివ్వాలని మాటల సందర్భంలో అన్న
విషయం. HRA విషయంపై
ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
>ప్రతీరోజూ పాఠశాలలకు హాజరై U-DISE మరియు పెండింగ్
కార్యక్రమాలన్నీ పూర్తి చెయ్యాలి.7వతేదీలోపల పూర్తి
చెయ్యాలి.
>ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు వారంలో ఒకరోజు ప్రాథమికోన్నత మరియు ఉన్నత
పాఠశాల ఉపాధ్యాయులు రెండురోజులు
> 50%చొప్పున అంటే ఒకరోజు
సగంమంది రెండవరోజు మిగిలిన సగంమంది హాజరు
కావాలి.
>కంటోన్మెంట్ జోన్లో నివసించే టీచర్లు కంటోన్మెంట్ జోన్లో స్కూలుకు
మినహాయింపు ఇచ్చారు.
> బయోమెట్రిక్ తీసివేయాలని చెప్పాం. పరిశీలించి ఉత్తర్వులు ఇస్తామన్నారు.
రేషనలైజేషన్
>ప్రాథమిక
పాఠశాలలకు: 1:30 నిష్పత్తి ప్రకారం 40 దాటితే
మూడు పోస్టులు ఇవ్వాలని ప్రతిపాదించాం. మిగిలిన పోస్టులను స్ట్రెంత్ ప్రకారము
సర్దుబాటు చేస్తారు.
>ప్రాథమికోన్నత
పాఠశాలలకు: గతంలో మాదిరిగానే ఉన్నత పాఠశాలలకు: 240 ప్రతిపాదన
ప్రభుత్వం తీసుకురాగా, ఉపాధ్యాయ సంఘాల నేతలు 180 ప్రతిపాదనకై పట్టు పట్టినందువలన
పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారు.
>ఇంగ్లీష్
మీడియం ఉంటే నాలుగు పోస్టులు కొనసాగుతాయి.
బదిలీలు:
>బదిలీలకు
కనీసం రెండు సంవత్సరాలు. జులై 31 తీసుకోవాలని ప్రతిపాదించాం. ఎనిమిది
అకడమిక్ సంవత్సరాలు అన్నారు. పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.
>హెచ్ఎంలకు
ఐదు సంవత్సరాలు.
>అప్
గ్రెడేషన్ పోస్టుల గురించి పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారు.
>మోడల్
స్కూల్ మరియు కేజీబీవీలో కూడా బదిలీలు.
>పెర్ఫార్మన్స్
పాయింట్లు లేవు. సర్విస్ పాయింట్లు, స్టేషన్ పాయింట్ ఉంటాయి.
పాయింట్లు:
>రేషనలైజేషన్
కి 2 పాయింట్లు.
>స్పౌజ్ వారికి 5 పాయింట్లు.
>క్యాటగిరి
1 కి 1
పాయింట్, కేటగిరి 2 కు 2 పాయింట్లు, కేటగిరీ 3 కు 3 పాయింట్లు,
క్యాటగిరి 4 కు 5 పాయింట్లు.
>సర్వీస్
పాయింట్ సంవత్సరానికి 1పాయింట్ ఇవ్వాలని ప్రతిపాదించాం స్పష్టత
రాలేదు. పరిశీలించి తగు నిర్ణయం
తీసుకుంటారు.
చర్చ పై FAPTO వారి ప్రెస్ నోట్
0 Komentar