Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Deferred March and April arrears must be paid- AP GOVT

వాయిదా వేసిన మార్చి, ఏప్రిల్ నెలల బకాయిలు తప్పక చెల్లిస్తాం
-పూర్తి జీతాలను తప్పకుండా చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వివరణ
కరోనా కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన పూర్తి జీతాలను తప్పకుండా చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. లాక్ డౌన్ తర్వాత సర్కార్ రాబడి బాగా పడిపోయిందని, ఉన్నంతలోనే సర్దుబాటు చేస్తూ చెల్లింపులు చేస్తున్నామని చెప్పింది. మార్చి, ఏప్రిల్ నెలల జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం వాయిదా వేసిందని, వాటిని చెల్లించేలా రాష్ట్రానికి ఆదేశాలివ్వాలని కోరుతూ రిటైర్డ్ జిల్లా జడ్జి డి.లక్ష్మీ కామేశ్వరి దాఖలు చేసిన పిల్ ను గురువారం న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ బి.కష్ణమోహన్ లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ప్రభుత్వ లాయర్ చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ, ఆదాయం తగ్గినా పేదల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ఆ రెండు నెలల్లో జీతాల్ని వాయిదా వేశామని, త్వరలోనే చెల్లిస్తామని చెప్పారు. విచారణ శుక్రవానికి వాయిదా పడింది.
Previous
Next Post »
0 Komentar

Google Tags