ట్రిపుల్ ఐటీలకు
ఎంట్రన్స్..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
టెన్త్ (2019–20 బ్యాచ్) విద్యార్థుల మార్కుల మెమోల్లో గ్రేడ్
పాయింట్లు లేకుండా వాటి స్థానంలో సబ్జెక్టుల వారీగా ‘పాస్’
అని పేర్కొనాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ ఒక్క ఏడాదికి
మాత్రమే ఇది వర్తించేలా పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ మంగళవారం
జీఓ 34ను విడుదల చేశారు. దీని ప్రకారం టెన్త్ పరీక్షలకు దరఖాస్తు చేసి హాల్
టికెట్లు జారీ అయిన విద్యార్థులందరూ గ్రేడ్ పాయింట్లు లేకుండా ఉత్తీర్ణులైనట్లుగా
ప్రకటించారు. అయితే, ఈ బ్యాచ్ విద్యార్థులకు గ్రేడ్
పాయింట్లు కేటాయించనందున వీరిని పై కోర్సుల్లో చేర్చుకునేటప్పుడు మెరిట్
విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని
జీఓలో పేర్కొన్నారు.
సర్కారు తాజా
నిర్ణయంతో నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఇప్పుడు ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సిన
పరిస్థితి కనిపిస్తోంది. అలాగే, టెన్త్ తరువాత ఎక్కువ మంది
విద్యార్థులు చేరేది ఇంటర్‌లోనే. వీటికీ మెరిట్ ప్రాతిపదికన అడ్మిషన్లు
జరపాలనుకుంటే ఎంట్రన్సు టెస్టులు నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు.. టెన్త్‌లో
మెరిట్ ఆధారంగా జరిగే ఉద్యోగాల నియామకాల్లో ఈ బ్యాచ్ అభ్యర్థులకు కొన్ని
మినహాయింపులు ఇవ్వాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
0 Komentar