Facebook brings
Instagram Reels to replace TikTok
టిక్‌టాక్
స్థానం భర్తీకి ఇన్‌స్టాగ్రామ్ ‘రీల్స్’
ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో
కూడా షాట్ వీడియోస్- రాత్రి 7.30కు ఇన్‌స్టాగ్రామ్ ‘రీల్స్’
చైనాకు చెందిన టిక్‌టాక్ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించడంతో ఆ
వినియోగదారులను ఒడిసిపట్టుకొనేందుకు మిగిలిన టెక్ దిగ్గజాలు ప్రయత్నాలను ముమ్మరం
చేశాయి. భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పరీక్షించడం మొదలుపెట్టినట్లు ఫేస్‌బుక్
బుధవారం అధికారికంగా తెలియజేసింది. దీనికి సంబంధించిన ట్రైల్ రన్స్
జరుగుతున్నాయి. దీనిలో వినియోగదారులు 15క్షణాలపాటు మల్టీక్లిప్ వీడియోను
చిత్రీకరించడం.. ఎడిట్ చేయడం వంటివి చేయవచ్చు. ఈ వీడియోలను వాళ్ల ఫాలోవర్లకు ఇన్‌స్టాగ్రామ్
ఫీడ్‌లో షేర్ చేయవచ్చు. దీనిలో ఎక్స్‌ప్లోరల్ ఫీచర్ కారణంగా ఎక్కువ మంది ఇన్‌స్టా
వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.
దీనికోసం బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలతో పాటు ఇండియాలో కూడా చాలా మంది కంటెన్ట్ రైటర్లను అడిగి ఇన్‌స్టాగ్రామ్ సూచనలు తీసుకుంటోంది. భారత్‌లో దీనికి సంబంధించిన టెస్టింగ్‌లో భాగంగా ప్రముఖ టిక్‌టాక్ స్టార్‌లను తమ వీడియోలు పోస్ట్ చేయాలని కోరింది. భారత్‌లో ఈ రోజు(బుధవారం) సాయంత్రం 7:30నుంచి ఇన్‌స్టాగ్రామ్ వీడియో టెస్టింగ్ మొదలు కానుంది. ఇందుకోసం టిక్‌టాక్, ఫేస్‌బుక్‌లో బాగా పాపులర్ అయినవారిని వీడియోలు పోస్ట్ చేయాలని ఇన్‌స్టాగ్రామ్ కోరింది. రీల్‌లో కూడా టిక్‌టాక్‌లో వచ్చే మాదిరిగానే బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్, డైలాగ్‌లు వస్తూ ఉంటాయి. అదేవిధంగా మనకి కావలసిన ఎఫెక్ట్‌లు, బయట సౌండ్స్ ఉపయోగించాలంటే కూడా ఉపయోగించవచ్చు. ఇది కనుక సక్సెస్ అయితే టిక్‌టాక్ నిషేధంలో ఊపందుకున్న దేశీయ యాప్స్ చింగారీ, మిట్రాన్, రోపోసో, మోజ్ లాంటి వాటికి గట్టి పోటి ఇవ్వనుంది. ఇప్పటికే టిక్‌టాక్ స్టార్‌లందరూ తమని ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలో అవమని చెప్పారు.

0 Komentar