Feedback of parents concerning to reopening of schools
స్కూళ్లను ఎప్పటి
నుంచి ప్రారంభిద్దాం..?- రాష్ట్రాలకు కేంద్రం లేఖ
-సెప్టెంబర్ 5
నుండి తెరుస్తామన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
-తల్లితండ్రుల
అభిప్రాయాలు తెలుసుకోవాలన్న కేంద్రం
పాఠశాలలను
ఎప్పటినుంచి ప్రారంభించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారో రాష్ట్రాల వారీగా
అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (MHRD) అన్ని రాష్ట్రాల విద్యా శాఖలను కోరింది. ఈ మేరకు MHRD అండర్ సెక్రటరీ రాజేశ్ సాంప్లే.. రాష్ట్రా లు, కేంద్రపాలిత
ప్రాంతాల విద్యా శాఖ కార్యదర్శులకు లేఖలు రాశారు. స్కూళ్లను ఆగస్టు/
సెప్టెంబర్/అక్టోబర్‌లో ఏ నెలలో ప్రారంభిస్తే బాగుంటుందో తెలియజేయాలని
పేర్కొన్నారు. అలాగే తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారో కూడా తెలపాలని, ఇతరత్రా అంశాలు ఏమైనా ఉన్నా ఈ నెల 20లోగా తమ మెయిల్ ఐడీ coordinationeel@gmail.com లేదా rsamplay.edu@nic.in కి పంపించాలన్నారు.
Feed back form
0 Komentar