Foreign students must leave country says Donald trump
ఆన్‌లైన్ క్లాసులతో నడిచే కోర్సులు చేసేవారు.. మీ దేశాలకు
వెళ్లిపోండి..!
అమెరికా ప్రభుత్వం తాజా ఉత్తర్వులు
అమెరికాలోని విద్యాలయాల్లో ఆన్‌లైన్ మాధ్యమంలో వివిధ కోర్సులు
అభ్యసించాలనుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులు.. దేశం విడిచి వెళ్లాలని డొనాల్డ్
ట్రంప్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం.. వేలాది మంది భారతీయ
విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఒకవేళ విదేశీ విద్యార్థులు స్వదేశాలకు
వెళ్లకపోతే బలవంతంగానైనా తరలిస్తామని,
వర్సిటీ ఈ సెప్టెంబరులో ప్రారంభమయ్యే తరగతులను ఆన్‌లైన్ క్లాసుల
ద్వారా మాత్రమే నిర్వహిస్తే ఇది తప్పదని స్పష్టం చేసింది. ఆన్‌లైన్ క్లాసులతో
నడిచే కోర్సులకు ఇకపై వీసాల జారీ కూడా ఉండదని, సరిహద్దు రక్షణ
విభాగం కూడా విద్యార్థులను దేశంలోకి అనుమతించరని ఐసీఈ సోమవారం విడుదల చేసిన ఒక
ప్రకటన తెలిపింది. ఆన్‌లైన్‌తోపాటు ప్రత్యక్ష తరగతులు కూడా నిర్వహించే హైబ్రిడ్
కళాశాలు ఈ విషయాన్ని స్టూడెంట్ అండ్ ఎక్సే్ఛంజ్ విజిటర్ ప్రోగ్రామ్
అధికారులకు తెలియజేయాలని విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేసేందుకు తగినన్ని ఆన్‌లైన్
తరగతులకు హాజరు కావాల్సి ఉంటుందని ఐసీఈ స్పష్టం చేసింది.
ఏమిటీ ఉత్తర్వు: తాజా ఉత్తర్వులు ప్రకారం సెప్టెంబర్-
డిసెంబర్ సెమిస్టర్‌ను పూర్తిగా ఆన్‌లై్లో చదివే విద్యార్థులు అమెరికా విడిచి
వెళ్లాలి. అక్కడే ఉండాలనుకుంటే... ఆన్‌లైన్‌లో కాకుండా తరగతి గదుల్లో పాఠాలు
బోధించే విద్యాలయాలకు మారాలి.
ఎవరిపై ప్రభావం: అమెరికాలో దాదాపు 12 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు 8,700 విద్యాలయాల్లో చదువుతున్నారు. అందులో అత్యధికంగా చైనా విద్యార్థులు..
తర్వాత స్థానం భారత్‌దే. మూడు లక్షల 60 వేల మంది ఉన్నారు. తాజా
ఉత్తర్వుల ప్రభావం వీరిపై తీవ్రంగా పడనుంది. ఎందుకంటే కరోనా కాలంలో రాబోయే
సెమిస్టర్‌ను ఆన్‌లైనులో నిర్వహించాలని ఇటీవల హార్వర్డ్ సహా చాలా
విశ్వవిద్యాలయాలు నిర్ణయించాయి.
మళ్లీ అమెరికా రావచ్చా..! పూర్తి ఆన్‌లైన్‌లో చదివే
విద్యార్థులు కొత్త నిబంధన ప్రకారం స్వదేశాలకు వెళ్లాల్సిందే. వెళ్లిన వారు తిరిగి
రావడానికి అవకాశం ఉందా అంటే తక్కువేనంటున్నారు నిపుణులు. ఎందుకంటే కరోనా కారణంగా
ప్రపంచ వ్యాప్తంగా చాలా రాయబార కార్యాలయాల్లో వీసా ప్రకియను అమెరికా నిలుపుదల
చేసింది. దీనికి తోడు చాలా దేశాలు.. అంతర్జాతీయ ప్రయాణాలను నిషేధించాయి. ఈ సమయంలో
స్వదేశాలకు వెళితే వారు తిరిగి అమెరికాలో అడుగు పెట్టడం కష్టమే.
ఏం చేయాలి: ఆన్‌లైన్ నుంచి..తరగతి గదిలో పాఠాలు బోధించే
విద్యాలయాలకు మారిపోవాలి. అంతర్జాతీయ విద్యార్థులు తరలిపోతే ఆయా కళాశాలలకు
ఆర్థికంగా నష్టమే... కాబట్టి వారు కూడా పాక్షికంగా తరగతి గదుల్లో పాఠాలు బోధించే
అవకాశం కల్పించొచ్చు. అలా జరిగితే విద్యార్థులు ఈ ముప్పు నుంచి బయటపడే అవకాశం
ఉంది.
యూఎస్ దృష్టికి భారత్ ఆందోళన
ఆన్‌లైన్ క్లాస్‌లు మాత్రమే నిర్వహించే
విశ్వవిద్యాలయాల్లో చదివే విదేశీ విద్యార్థుల వీసాలను ఉపసంహరిస్తామన్న అమెరికా
ప్రకటనపై భారత్ ఆందోళన వెలిబుచ్చింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి
హర్షవర్ధన్ ష్రింగ్లా మంగళవారం అమెరికా విదేశాంగ రాజకీయ వ్యవహారాల అండర్
సెక్రటరీ డేవిడ్ హేల్‌తో ఆన్‌లైన్ భేటీ సందర్భంగా లేవనెత్తారని అధికార వర్గాలు
వెల్లడించాయి. భారత్ ఆందోళనను పరిగణనలోకి తీసుకున్నారని, అమెరికాలోని భారతీయ విద్యార్థులపై ఈ
నిర్ణయం ప్రభావం తక్కువగా ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపాయి. ఈ నిర్ణయానికి
సంబంధించిన విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదని చెప్పాయని వివరించాయి.
0 Komentar