Health
benefits of Bengal gram (Chickpea)
శనగలు
శనగలు
మంచి పౌష్టికాహారము. ఇందులో ప్రొటీనులు అధికంగా ఉంటాయి. శనగలు తినడం వల్ల అనేక
లాభాలు ఉన్నాయి. శనగలను పేదవాడి బాదాం అని అంటారు. ఎందుకంటే బాదాంలో ఉండే ప్రొటీన్
శాతం శనగల లో కూడా లభిస్తుంది. శనగలు తినని వారికంటే, శనగలు తీసుకున్న వారు త్వరగా బరువు
తగ్గుతారని తేలింది. శనగలతో గారెలు వేసుకున్నా, ఉడికించుకుని
తీసుకున్నా, కూర్మాలో వేసుకున్నా, సలాడ్
రూపంలో లాగించినా శనగల రుచే కమ్మగా ఉంటుంది. అంతేకాదు ఎన్నో పోషక విలువలను శనగలలో
పొందవచ్చు. నానబెట్టి, ఉడకబెట్టి తీసుకోవడం వల్ల ఎక్కువ
ప్రయోజనం ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల మంచి ప్రొటీన్లు తో పాటు పాలు, పెరుగుకి సమానమైన కాల్షియం శనగల్లో నుండి లభిస్తుంది. మాంసాహారం తినని వారు శనగలని తినడం వల్ల ప్రోటీన్ సంవృధ్దిగా
పొందినవారవుతారు.
శనగల్లో ఉండే పోషక పదార్ధాలు:
కార్బోహైడ్రేట్స్, ఫైబర్, మోనోసాచురేటడ్,
పాలి అన్ సాచురేటడ్ ఫ్యాట్స్, ప్రొటిన్లు,
విటమిన్ A, థయమిన్, (విట. B1), రైబొఫ్లేవిన్ (విట. B2), నయాసిన్ (విట. B3), పాంటోధెనిక్ ఆసిడ్ (B5), విటమిన్ B6, ఫ్లోట్ (vit. B9), విటమిన్ C, విటమిన్ E, విటమిన్
K, కాల్షియం, ఐరన్ , మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం,
సోడియం, జింక్ వంటి అనేక పోషకాలు, తక్కువ శాతంలో చక్కెర మరియు కొవ్వు పదార్ధాలు శనగలు నుండి మనకు లభిస్తాయి.
అందువల్ల శనగలను సంపూర్ణ ఆహారం అని చెప్పవచ్చు.
ఆరోగ్య
ప్రయోజనాలు:
1.శనగల్లో ఉండే అమినో యాసిడ్స్, ట్రిప్టొఫాన్, సెరొటోనిన్
వంటివి.. మంచి నిద్రను అందిస్తాయి.
2. శనగల్లో క్యాల్షియం పుష్కలంగా
ఉంటుంది. ఇవి.. పాలతో సమానం.
3.ఫాస్పరస్ ఎక్కువగా ఉంటుంది. ఇది
హిమోగ్లోబిన్ లెవెల్ ని పెంచుతుంది. అదనపు ఉప్పును బయటకు పంపుతుంది. అలాగే
కీడ్నీల్లో పేరుకున్న మలినాలను బయటకు పంపడంలో.. శనగలు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
4. శరీరానికి కావాల్సిన ఇనుము అందుతుంది.
దీనివల్ల రక్త హీనతకు దూరంగా ఉండవచ్చు.
5.రుతుక్రమం సమయంలో స్త్రీలకు వచ్చే
కడుపు నొప్పి వంటి సమస్యలకు మంచి పరిష్కారం ఇది. ఈ శనగల కొమ్మను తీసుకుని వేడి
నీళ్లలో వేసి స్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
6.మెగ్నీషీయం ఎక్కువగా లభించడం వలన
చర్మం పైన ముడతలను తగ్గిస్తుంది.
7.ఫ్యాటి యాసిడ్స్ ను బ్యాలెన్స్
చేసి స్కిన్ ఎలాస్టిసిటీని పెంచుతుంది.
8.పింపుల్స్ ను తగ్గించడంలో శనగలు
సహజంగా ఉపయోగపడతాయి.
9.శనగలలో ఉండే జింక్ చర్మంపై మచ్చలను
తొలగించి, స్కిన్ టోన్
మెరుగు పరచడంలో సహాయపడుతుంది.
10.యాంటి ఆక్సిడెంట్స్, యాంటి ఇన్ప్లమేటరీ గుణాలు చర్మంలో ఆయిల్
తగ్గించడంలో సహాయపడుతుంది.
11. డయాబెటీస్ ను తగ్గించి, బ్లడ్ ప్రెజర్ ను అదుపులో ఉంచుతుంది.
12. డైజెషన్ ను క్రమపరిచి వెయిట్ లాస్
కు సహాయపడుతుంది.
13. కాపర్, ఐరన్ ఉండడం వలన రక్తప్రసరన మెరుగు పరిచి
రక్తహీనతను తగ్గిస్తుంది.
14.విటమిన్ B, మెటబాలిజం మరియు మెగ్నీషియం లు చర్మం లోని
విషపదార్ధాలు తొలగించి చర్మం మెరిసేలా చేస్తాయి.
15.శనగ ఆకులలో కూడా క్యాభేజి, పాలకూరకు
సమానమైన ఖనిజాలు లభిస్తాయి. అజీర్తిని తగ్గించి గ్లూకోజ్ స్థాయిని క్రమబద్దీకరిస్తుంది.
0 Komentar