Health
benefits of horse gram dal
ఉలవలు
ఉలవలు అంటే మన
తెలుగు వారికి అమితమైన ఇష్టం. ఉలవచారు రుచి ఒక్కసారి చూస్తే ఇక దాన్ని
మర్చిపోరు. అంతటి చక్కని రుచిని ఉలవచారు కలిగి ఉంటుంది. అంతేకాక, ఉలవలను
తరచూ తింటే దాంతో మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి
పోషకాలు అందుతాయి.
ఉలవల వల్ల మనకు
కలిగే లాభాలు ఇవే..
>ఉలవల్లో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్,
ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్
స్థాయిలు, రక్తపోటు నియంత్రిస్తుంది. మధుమేహం అదుపులో
ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.
>నేత్ర సమస్యలు పోయి దృష్టి మెరుగు పడుతుంది.
>ఉలవలను ప్రతిరోజూ తింటే శరీరంలో ఉన్న కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు.
>ఉలవల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండడం వల్ల ఎదిగే పిల్లల శరీర
నిర్మాణానికి సహాయపడతాయి.
> ఆకలిని పెంచే గుణాలు ఉలవల్లో ఉంటాయి. మలమూత్ర విసర్జనలు సాఫీగా
అవుతాయి.
>పావు కప్పు ఉలవలను, చిటికెడు పొంగించిన ఇంగువను,
పావు టీస్పూన్ అల్లం ముద్దను, పాపు టీ స్పూన్
అతిమధురం వేరు చూర్ణాన్నీ తగినంత నీటిని కలిపి ఉడికించి తేనె కలిపి నెలపాటు
తీసుకుంటే అల్సర్లు వెంటనే తగ్గుతాయి.
>ఒక కప్పు ఉలవచారుకి సమాన భాగం కొబ్బరి నీరు కలిపి తీసుకుంటుంటే మూత్రంలో
మంట తగ్గుతుంది.
>కళ్లు కన్నీరు కారటం, కళ్లల్లో పుసులు కట్టడం వంటి
సమస్యలకు ఉలవలతో చేసిన ఆహారం నివారిస్తుంది.
> మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి, కిడ్నీల
పనితీరుని మెరుగుపరుస్తాయి.
>తరచూ ఎక్కిళ్ల సమస్యతో బాధపడుతున్నవారికి ఉలవలను తీసుకోవడం వల్ల ఉపశమనం
లభిస్తుంది.
> ఉలవలను ఆహారంలో వాడేవారికి మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది.
>ఉలవలను ఆహార రూపంలో తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది. ముందుగా ఒక కప్పు
ఉలవలకు నాలుగుకప్పులు నీళ్లు కలిపి కుక్కర్‌లో ఉడికించి ప్రతిరోజూ ఉదయంపూట ఖాళీ
కడుపుతో, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా
సన్నబడతారు. ఉలవలు తీసుకునే సమయంలో శరీరంలో మంటగా అనిపిస్తుంటే మజ్జిగ తాగితే
సరిపోతుంది.
0 Komentar