పెసలు (Green Gram)
ఆహార అలవాట్లలో
కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా
ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. కొన్ని గింజలను మీ రోజువారీ ఆహారంలో
చేర్చుకోవడం ద్వారా మీ ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతంది. తాజా పరిశోధనల ప్రకారం
పప్పులు,
చిక్కుళ్లు వంటి ప్రోటీన్స్తో నిండిన ఆహారం తీసుకుంటే జీవన
ప్రమాణాలు పెరిగినట్లు తేలింది. అంతేకాదు, పప్పులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పెసలతో హల్వ, పులగం, వడలు, పప్పుచారు,
దోసె, పెసర లడ్డు వంటి అనేక రకాల వంటలు
చేసుకోవచ్చు. ప్రస్తుతం మొలకెత్తిన పెసలు, మూంగ్దాల్కు
మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఒక కప్పు పెసలలో 40.5 మరియు 71 శాతం పోషకాలు
అందిస్తుంది. పెసలు (మూంగ్ దాల్) పోషకాలు అధికంగా ఉండే ఆహారం. అవి పొటాషియం,
మెగ్నీషియం, ఇనుము మరియు రాగి వంటి ఖనిజాలతో
నిండి ఉన్నాయి. వీటితో పాటు అధిక-నాణ్యత ప్రోటీన్లే కాకుండా, ఫోలేట్, ఫైబర్, మాంగనీస్,
విటమిన్-సి మరియు విటమిన్-బి6, కూడా ఉన్నాయి.
ముఖ్యంగా పెసలు చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
ముడిపెసలలో
విటమిన్స్, ప్రోటీనులు అధికంగా మరియు లోకార్బోహైడ్రేట్స్ ఉంటాయి.
ఇవి శరీరానికి రక్షణ కల్పించడం మాత్రమే కాదు, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
పెసలు తినటం వల్ల
ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేకూరుతుందో తెలుసుకుందాం..
1.పెసలు బ్లడ్ ప్రెషర్ను
తగ్గిస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి.
2.ఐరన్ లోపంతో
బాధపడేవారు రెగ్యులర్ డైట్ లో పెసలను చేర్చుకోవాలి. వీటిలో ఐరన్ కంటెంట్ అధికంగా
ఉంటుంది.
3.ఇది రక్తంలో
చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి మరియు మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.
4.ముఖ్యంగా పెసలు
చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. చర్మంలో మృదుత్వం వస్తుంది.
5.ఈ పప్పులో
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి గ్యాస్ నిరోధిస్తాయి.
6.ఇది పేగు గోడల
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
7.పెసలులో ఉండే
పుష్కలమైనటువంటి ప్రోటీనులు మరియు న్యూట్రీషియంట్స్ ఆరోగ్యకరమైన జుట్టు పొందడానికి సహాయపడుతాయి.
8.పెసలు పేస్టు
తయారుచేసి అందులో ఓ టీ స్పూన్ తేనె కలపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే, చర్మంపై
ఉండే మృత కణాల్ని తొలగించి, చర్మాన్ని మెత్తగా, మృదువుగా అయి ముఖం మెరుస్తంది.
9.కంటిచూపు
సమస్యలు దరికి చేరవు.
10.పెసలు తినటం
వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినదు.
11.బి-కాంప్లెక్స్
విటమిన్లతో సమృద్ధిగా ఉన్న మూంగ్ దాల్ మీ శరీరం కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్ గా
మార్చడంలో సహాయపడుతుంది.
12.పెసర పిండి
బాత్ పౌడరుగా కూడా ఉపయోగిస్తారు. చర్మం
తెల్లబడేందుకు పెసలు బాగా పనిచేస్తాయి.
0 Komentar