Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Healthy Foods That Are High in Vitamin-D

Healthy Foods That Are High in Vitamin-D


విటమిన్-డి లభించే ఆహార పదార్థాలు
విటమిన్-డి లోపం జీవనవిధానంలో విపరీతమైన మార్పులు రావడం దీనికి ముఖ్య కారణం. ఎండ తగలకుండా ఉండటం, ఎండలో ఉంటే శరీరానికి సన్‌స్ర్కీన్‌ లోషన్‌ రాసుకోవడం. విటమిన్‌-డి ఉన్న ఆహార పదార్థాలు తీసుకోకపోవడం మరో కారణం. విటమిన్‌-డి లోపం వల్ల శక్తి లోపించడం, కండరాల నొప్పి, జుట్టు రాలడం, ఎముకలు గుల్లబారడం (ఆస్టియోపోరోసిస్‌), మానసిక కుంగుబాటు వంటి సమస్యలు వస్తాయి. మధుమేహం, గుండెకు సంబంధించిన సమస్యలను కూడా ప్రస్తుతం విటమిన్‌-డి లోపానికి లింక్‌ చేస్తున్నారు. విటమిన్‌-డి అనేది కొవ్వులో కరిగే విటమిన్‌. ఇది కాలేయంలో నిల్వ ఉంటుంది. మొదటగా కాలేయంలో తయారై అక్కడి నుంచి కిడ్నీలో మనకు ఉపయోగపడే విధంగా మారుతుంది. దీనినే కాల్సిట్రియోల్‌అంటారు. ఇది యాక్టివ్‌ విటమిన్‌-డి. వయసు పెరిగే కొద్ది విటమిన్‌-డి లోపం అధికమవుతుంది.
'విటమిన్-డి' లోపం ఉన్నవారే కరోనా బారిన పడుచున్నారు..  
విటమిన్-డి లోపించినవారే ఎక్కువ మంది కరోనా బారిన పడుతున్నారని, మృతుల్లోనూ వారే అధికమని వైద్య నిపుణులు చెప్తున్నారు. విటమిన్-డి సమృద్ధిగా ఉన్నవాళ్లు వైరస్ వచ్చినా త్వరగా కోలుకుంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో 80శాతం మందికి విటమిన్-డి లోపం ఉన్నట్లు తేలింది. కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి విటమిన్-డి పెంచుకోవాలని సూచిస్తున్నారు. అటు 24 గంటలు ఏసీలో ఉండేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు.
చ‌ర్మం కిందే విట‌మిన్-డి త‌యారీ
సూర్యకాంతిలో ఉండే అల్ట్రావయొలెట్ బి కిరణాలు చర్మంపై పడినప్పుడు చర్మం కింద ఉండే పలు పదార్థాలు విటమిన్-డి ని తయారు చేసుకుంటాయి. అనంతరం లివర్, కిడ్నీల్లో విటమిన్ డి హైడ్రాక్సిలేషన్ ప్రక్రియకు గురవుతుంది. అనంతరం దాన్ని శరీరం ఉపయోగించుకుంటుంది. అలా సూర్యరశ్మి ద్వారా తయారైన విటమిన్ డి మన శరీరంలోని రక్తంలో ఉండే కాల్షియంకు తోడై ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. 18% శరీరం 45 నిమిషాల పాటు ఎండకు ఎక్స్‌పోజ్‌ అయితే మనకు కావాల్సినంత విటమిన్‌-డి లభించినట్టే. ఈ విటమిన్‌ను సూర్యకాంతిని గ్రహించి శరీరమే తయారుచేసుకోగలదు.
విటమిన్-డి అధికంగా ఉండే ఆహారపదార్థాలు
>చేపలలో ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్లు ఎక్కువ ఉంటాయి. వారానికి కనీసం రెండుసార్లు సాల్మన్‌, సార్డనైస్‌, హెర్రింగ్‌ వంటి చేపలు తీసుకుంటే మంచిది. వైట్‌ ఫ్యాటీ ఫిష్‌ తీసుకోవడం మంచిది.
>పుట్టగొడుగుల్లో కూడా విటమిన్‌-డి ఉంటుంది. వీటిని కొంత సమయం ఎండబెట్టడం వల్ల కూడా విటమిన్‌-డి పెరుగుతుంది. పుట్టగొడుగులను ఇతర కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు. బటన్ మష్రూమ్స్ చాలా సాధారణంగా విటమిన్-డి ఎక్కువగా ఉండే పుట్టగొడుగులు.
>గుడ్డు పసుపు సొనలో విటమిన్‌-డి ఉంటుంది. కొందరు ఎగ్‌ వైట్‌ మాత్రమే తీసుకుంటారు. అలాకాకుండా పసుపు సొనను కూడా తీసుకోవడం మంచిది. ఒక పెద్ద గుడ్డు రోజువారీ సూచించిన విటమిన్ డి లో 10 శాతాన్ని అందిస్తుంది. గుడ్లలో ఇతర విటమిన్లు ఎ, కె, మరియు ఇ కూడా ఉంటాయి.
>రొయ్యలలో అధికంగా ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్లు మరియు విటమిన్ డి ఉంటాయి, ఇవి వాపులు తగ్గించేటప్పుడు మరియు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గేటప్పుడు మీ ఎముకలకు చాలా మంచిది.
>ఒక కప్పు పచ్చి పాలల్లో రోజువారీ సూచించిన విటమిన్ డి లో 24 శాతం వరకూ ఉంటుంది.
>మీ ఆహారంలో జున్నును జతచేసుకోవటం వలన విటమిన్ డి లోపం వచ్చే రిస్క్ తగ్గుతుంది.
>ఒక గ్లాసు ఆరెంజి (కమలాపళ్ళు) రసం కూడా చాలా విటమిన్ డి మరియు కాల్షియం అందిస్తుంది. ఒక కప్పు ఆరెంజి రసం 36 శాతం విటమిన్ డి ని అందిస్తుంది.
>ఒక అరకప్పు ఓట్ మీల్ దాదాపు 39 శాతం వరకు విటమిన్ డిని మీకు అందించగలదు. బ్రేక్ ఫాస్ట్ కి ఓట్ మీల్ తినడం మొదలుపెట్టండి, మీ విటమిన్ డి స్థాయి పెరుగుతుంది.
>వెన్నలో తక్కువ, కానీ చాలా ముఖ్యమైన పరిమాణంలో విటమిన్ డి ఉంటుంది. ఇది 9 ఐయూల విటమిన్ డి ని అందిస్తుంది.
> పెరుగు శరీరం కాల్షియం ఎక్కువ పీల్చుకునేలా చేస్తుంది. ఒక కప్పు పెరుగు రోజువారీ విటమిన్ డిలో 20 శాతాన్ని అందిస్తుంది.
>నట్స్‌, ఆయిల్‌ సీడ్స్‌లో కూడా విటమిన్‌-డి లభిస్తుంది. వీటిని డైలీ డైట్‌లో తీసుకోవడం మంచిది.

Previous
Next Post »
0 Komentar

Google Tags