IBA agrees to
15% wage hike for PSU Bank Employees
బ్యాంకు
ఉద్యోగులకు 15% వేతన పెంపు
-పనితీరు ఆధారిత
ప్రోత్సాహకాలు కూడా
-లాభా లెక్కువున్న
బ్యాంకుల్లో సిబ్బందికి అదనపు వేతనం
వేతన పెంపునకు బ్యాంకు
ఉద్యోగుల యూనియన్లు, భారత బ్యాంకుల సంఘం(ఐబీఏ) ఒక అంగీకారానికి
వచ్చాయి. మార్చి 31, 2017 నాటి వేతనం పై 15 శాతం లెక్కించి వార్షిక వేతన పెంపును అమలు చేస్తారు. నవంబరు 2017 నుంచి
అమల్లోకి వచ్చే ఈ వేతన పెంపుతో దాదాపు 8.5 లక్షల మంది
ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ఈ ఒప్పందం ప్రకారం.. ప్రభుత్వ రంగ బ్యాంకుల
సిబ్బందికి పనితీరు ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్)ను సైతం అందించనున్నారు. లాభా లెక్కువున్న
బ్యాంకుల్లో సిబ్బందికి అదనపు వేతనం లభిస్తుందన్నమాట.
మరో వైపు కొత్త
పింఛను పథకం(ఎన్‌పీఎస్)కు బ్యాంకులు ఇచ్చే వాటాను సైతం ప్రస్తుత 10
శాతం నుంచి 14 శాతానికి పెంచనున్నారు. అయితే దీనికి ప్రభుత్వ
ఆమోదం లభించాల్సి ఉంది. మరో పక్క కుటుంబ పింఛను విషయంలో పరిమితిని తొలగించడంతో
పాటు, మూలవేతనంలో 30% ఇవ్వడానికి సైతం అంగీకారం కుదిరింది.
తాజా పెంపుతో బ్యాంకులు అదనంగా రూ.7,900 కోట్లు ఇందుకోసం కేటాయించాల్సి
వస్తుంది.
0 Komentar