ICMR process develop vaccine to fight COVID-19 pandemic as per globally
accepted norms of fast tracking
కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు భారత్ బయోటెక్ తయారుచేసిన 'కోవాగ్జిన్' టీకాను ఆగస్టు 15నాటికి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం
తెలసిందే.
ఈ సమయంలో ఇంత తక్కువ వ్యవధిలో ఇదెలా సాధ్యమనే విషయంపై
నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)
స్పష్టతనిచ్చింది. వ్యాక్సిన్‌పై ప్రీ-క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా
పూర్తి చేసుకున్నందునే తదుపరి మొదటి- రెండోదశ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి
ఇచ్చినట్లు ప్రకటించింది. దేశంలో అత్యవసర పరిస్థితిని పరిగణనలోకి
తీసుకొని వ్యాక్సిన్‌ను వేగంగా తీసుకురావడంలో భాగంగా అంతర్జాతీయ నిబంధనలకు
అనుగుణంగానే ప్రయోగాలు చేపడుతున్నట్లు స్పష్టం చేసింది.
0 Komentar