IITM B.Sc.,
Online degree details
ఆన్‌లైన్‌లో
బీఎస్సీ డిగ్రీ
ప్రపంచంలోనే
మొదటిసారిగా ఆన్‌లైన్ ద్వారా బీఎస్సీ డిగ్రీ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం
శ్రీకారం చుట్టింది. ఐఐటీ మద్రాస్ అభివృద్ధి చేసిన బీఎస్సీ డిగ్రీలో
ప్రోగ్రామింగ్, డాటా సైన్స్ కోర్సును మంగళవారం కేంద్ర మానవ వనరుల
అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ నిశాంక్ పోఖ్రియాల్, సహాయమంత్రి
సంజయ్ ధోత్రేలు ప్రారంభించారు. పదో తరగతిలో ఆంగ్లం, గణితం
చదివి పన్నెండో తరగతి ఉత్తీర్ణత సాధించిన లేదా ఆన్-క్యాంపస్ అండర్ గ్రాడ్యుయేట్
కోర్సు పూర్తి చేసిన వారు ఎవరైనా ఈ కోర్సులో పేరు నమోదు చేయించుకోవచ్చు.
అందరికీ అందుబాటులో
ఉండేలా..
వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో డాటా సైన్స్ ఒకటి. ఈ రంగం 2026 నాటికి 11.5 మిలియన్ల ఉద్యోగాలు సృష్టిస్తుందని
అంచనా. అందరికీ అందుబాటులో ఉండేలా ఐఐటీ మద్రాస్ అధ్యాపకులు ఈ కోర్సుకు రూపకల్పన
చేశారు. ఈ ఆన్‌లైన్ కోర్సు ఫౌండేషన్ ప్రోగ్రామ్, డిప్లొమా
ప్రోగ్రామ్, డిగ్రీ ప్రోగ్రామ్‌గా మూడు వేర్వేరు దశల్లో
ఉంటుంది. కోర్సు ఫీజు, ఇతరత్రా వివరాల కోసం www.onlinedegree.iitm.ac.in వెబ్‌సైట్ చూడొచ్చని అధికారులు
తెలిపారు.
0 Komentar