కరోనా వైద్యం
ఫీజులను నిర్ధారించిన ఏపీ ప్రభుత్వం
కరోనా
వైద్యానికయ్యే ఫీజులను నిర్ధారిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
చేసింది. ఈ మేరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వసూలు చేసే ఫీజులపై వైద్య ఆరోగ్య శాఖ
స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి బుధవారం రోజున ఉత్తర్వులు జారీ చేశారు. అందులో
భాగంగానే మరికొన్ని కరోనా వైద్య ప్రక్రియలను ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిధిలోకి
చేర్చింది. ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ పరిధిలోని ఆస్పత్రులన్నీ ఇవే ఫీజులను వసూలు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఫీజుల వివరాలు
>నాన్
క్రిటికల్ కరోనా పేషేంట్ల వైద్యానికి రోజుకి 3,250 రూపాయలుగా
నిర్ధారించింది.
>క్రిటికల్
కోవిడ్-19 పేషెంట్లకు ఐసీయూలో వెంటిలేటర్లు, ఎన్‌ఐవీ లేకుండా
ఉంచితే రోజుకి 5,480 రూపాయలు ఫీజుగా నిర్ణయించారు.
>ఎన్‌ఐవీతో
ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తే రోజుకి రూ. 5,980 ఛార్జ్ చేయనున్నారు.
>వెంటిలేటర్ పెట్టి వైద్యం
అందిస్తే రోజుకి 9,580గా నిర్ధారించారు.
>ఇన్ఫెక్షన్ ఉన్న వారికి
వెంటిలేటర్ లేకుండా వైద్యం అందిస్తే రోజుకి రూ. 6,280గా
ఉండనుంది.
>ఇన్ఫెక్షన్ ఉండి, వెంటిలేటర్ పెట్టి వైద్యం అందిస్తే రోజుకి రూ.10,380
ఫీజు వసూలు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా కరోనాకు చికిత్స అందజేయు అసుపత్రుల వివరాలు
List of Corona
Treatment Offering Hospitals under "Arogyasri"
DOWNLOAD
Inclusion of certain procedures under Dr YSR Aarogyasri Scheme to treat the cases of Suspected and Confirmed positive COVID –19 cases – Orders - Issued.
G.O.Ms.No.77, Dated.08.07.2020
0 Komentar