ఓబీసీల రిజర్వేషన్లకు ఆదాయ పరిమితి పెంపు యోచనలో కేంద్రం..!
ఓబీసీల రిజర్వేషన్లకు
సంబంధించి ఆదాయ పరిమితిని పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. అలాగే
వార్షికాదాయం లెక్కింపు విధానంలోనూ కొన్ని మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వార్షికాదాయం రూ. 8 లక్షలున్నవారికి ఇది వర్తిస్తుండగా దీన్ని రూ. 12 లక్షలకు పెంచే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన త్వరలోనే కేబినెట్ ముందుకు
రానుంది. దీనికి సంభందించి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
నేతృత్వంలోని మంత్రుల బృందం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
0 Komentar