Issue of Income
Certificate by Revenue Authorities – Orders cancelled
తెల్ల రేషన్‌కార్డునే
ఆదాయ ధ్రువీకరణ పత్రంగా పేర్కొంటూ 25వ తేదీన జారీ చేసిన జిఒను
రద్దు
తెల్ల రేషన్‌కార్డునే
ఆదాయ ధ్రువీకరణ పత్రంగా పేర్కొంటూ 25వ తేదీన జారీ చేసిన జిఒను
రద్దు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి గురువారం ఉత్తర్వులు జారీ
చేశారు. తెల్ల కార్డుదారులకు ఆటోమెటిక్ గా ఆదాయ ధ్రువీకరణ పత్రం రూపొందించే
ప్రతిపాదనలు ఉన్న నేపథ్యంలో జిఒను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై
రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ కొత్తగా రేషన్ కార్డును ఆదాయ ధ్రువీకరణగా
ప్రతిపాదించాల్సిన అసవరం లేదని, ఆన్ లైన్లో ఉన్నవారి వివరాల
ప్రకారం ఆదాయ ధ్రువీకరణ ఆటోమెటిక్ గా జరిగిపోతుందని తెలిపారు. తెల్ల రేషన్‌కార్డునే
ప్రాతిపదికగా తీసుకుంటే కొన్ని నకిలీ కార్డుదారులు కూడా లబ్ది పొందుతారని, కుటుంబ సర్వే ఆధారంగా వివరాలన్నీ పొందుపర్చిన తర్వాత
ఆన్‌లైన్లోనే
దీనికి సంబంధించిన వివరాలు లబ్ధిదారుని ఆధార్ నెంబరు, రేషన్‌కార్డు
ఆధారంగా తెలిసిపోతాయని పేర్కొన్నారు.
Revenue
Department – Issue of Income Certificate by Revenue Authorities – Orders cancelled.
G.O.MS.No. 211,
Dated: 30-07-2020
0 Komentar