గేట్-2021లో పలు మార్పులు
ఐఐటీల్లో పీజీ, పీహెచ్‌డీ
కోర్సుల్లో ప్రవేశానికి మరియు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లో ఉద్యోగాల
కోసం నిర్వహిస్తున్న గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)లో
కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. గేట్ లో సాధించిన స్కోర్‌కు మూడేళ్లపాటు విలువ
ఉంటుంది. అయితే కామర్స్, ఆర్ట్స్
సబ్జెక్టులనూ చేర్చుతున్న నేపథ్యంలో గేట్ పేరును మారుస్తారా? లేక అలాగే కొనసాగిస్తారా? అనేది వేచిచూడాలి.
ముఖ్యమైన మార్పులివీ..
> గేట్-2021కి హ్యుమానిటీస్ సబ్జెక్టులనూ చేర్చనున్నారు. దీంతో కామర్స్, ఆర్ట్స్ చదివిన విద్యార్థులకూ గేట్ రాసే అవకాశం కలుగుతుంది. అందులో ర్యాంకు సాధించి ఐఐటీల్లో ఎంఏ కోర్సులు అభ్యసించవచ్చు. పీఎస్‌యూలు నిర్వహించే ఉద్యోగ ముఖాముఖీలను సైతం
ఎదుర్కోవచ్చు.
> గేట్ కనీస
అర్హతగా 10+2+4 నిబంధన ఉంది. అది 10+2+3గా మారనున్న నేపథ్యంలో
అండర్ గ్రాడ్యుయేట్ మూడో ఏడాదిలో ఉన్న వారు కూడా ఈ పరీక్ష రాసే అవకాశం
దక్కుతుంది.
>ఇప్పటివరకు 25
సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించేవారు. ఈ సారి కొత్తగా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్
అండ్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైస్సెస్
పేపర్లను ప్రవేశపెడుతున్నారు.
>గేట్ 2020 వరకు ఒక విద్యార్థి ఒక్క సబ్జెక్టులోనే పరీక్ష రాయాలి. ఇప్పుడు రెండు
సబ్జెక్టులూ రాయవచ్చు.
>గతంలో రెండు
విడతలుగా నాలుగు రోజులపాటు ఆన్‌లైన్ పరీక్షలు జరిపేవారు. ఈ సారి ఆరు రోజుల పాటు
పరీక్షలు నిర్వహిస్తారు.
>గేట్
పరీక్షలను వచ్చే ఫిబ్రవరి 5, 6, 7, 12, 13వ తేదీల్లో ఈ పరీక్షను ఐఐటీ
బాంబే నిర్వహించనుంది.
0 Komentar