ఏపీ ఉన్నత విద్య
నియంత్రణ,
పర్యవేక్షణ కమిషన్ కు మరిన్ని అధికారాలు
-కమిషన్’ పరిధిలోకి
ప్రైవేట్ వర్సిటీలు..
-గతంలో జారీ చేసిన
నిబంధనల్లో పలు మార్పులు తెచ్చింది..
రాష్ట్రంలోని
ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ
కమిషన్ పరిధిలోకి రానున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఫీజుల ఖరారు, విద్యా ప్రమాణాల పెంపు విషయాల్లో
అనుసరించాల్సిన విధివిధానాలపై ఉన్నత విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా
ప్రత్యేక సంఘటన చోటుచేసుకుంటే అప్పుడు డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లోనూ కమిషన్
జోక్యం చేసుకుంటుంది.
ఉన్నత
విద్యాసంస్థలు (డిగ్రీ, ఇంజినీరింగ్ తదితర) బోధన, బోధనేతర సిబ్బందికి చెల్లించే వేతనాలు, వారి
నియామకాలు, అర్హతలు, విద్యార్ధుల సంఖ్య,
ఇతర అన్ని అంశాలను కమిషన్ పర్యవేక్షిస్తుందని పేర్కొంది. కమిషన్
నిర్ణయించిన ఫీజుల మేరకు యాజమాన్య కోటా కింద సీట్లు భర్తీ చేసుకోవచ్చని తెలిపింది.
ప్రవేశాల కోసం పోటీ పరీక్షలు నిర్వహించడంపై కమిషన్‌కు అధికారాలుంటాయి. విద్యార్థుల
నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే తీసుకున్నదానికి మూడింతలు జరిమానా విధించే అధికారం
కమిషన్‌కు ఉంటుంది. ఈ జరిమానా రూ.15 లక్షల వరకూ ఉండే అవకాశముంది.
కమిషన్‌లో
ప్రస్తుతం ముగ్గురు పూర్తిస్థాయి సభ్యులు, ఆరుగురు పార్ట్ టైమ్
మెంబర్లు ఉన్నారు. పని ఒత్తిడి పెరుగుతుండటంతో పార్ట్ టైమ్ మెంబర్లకు ఫుల్
టైమర్లుగా పనిచేసే అవకాశం కల్పించారు. వీరి జీత, భత్యాలను
భారీగా పెంచారు. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్
పూర్తిస్థాయి సభ్యులకు నెలకు రూ.1.75 లక్షల వేతనం
చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెలకు రూ.40 వేల ఇంటి
అద్దె కూడా ఇస్తారు. తాత్కాలిక సభ్యులు సమావేశాలకు హాజరైతే రూ.5 వేల చొప్పున చెల్లించాలని నిర్ణయించారు.
0 Komentar