Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Mouth ulcers-causes-treatment-preventions inTelugu

Mouth ulcers-causes-treatment-preventions-in-Telugu  

నోటిలో పుండ్లు

మన శరీరంలో సున్నితమైన అంతర్గత భాగాల్లో నోరు కూడా ఒకటి. ఈ నోటి లోపల గోడలకు, నాలుకకు, పెదాల లోపలి అంచులకు, చిగుళ్లపై పొక్కులు మొదలై పుండ్లుగా మారి తీవ్రంగా బాధపెడుతుంది. వీటిని మౌత్ సోర్, మౌత్ అల్సర్లు అని అంటుంటారు. మనలో చాలా మందికి ఎప్పుడో ఒకసారి నోటిలో పుండ్లు ఏర్పడిన అనుభవం ఉండే ఉంటుంది. అలా పుండ్లు రావడం వలన ఆహారం నోట్లో పెట్టుకుంటే చాలు మండిపోతుంది. ఓ వారం నుంచి రెండు వారాల పాటు ఇవి తమ ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ఇవి వాటంతట అవే తగ్గలేదంటే ఒకసారి వైద్యుడిని సంప్రదించడం అవసరం.
నోటి పుండ్లు కారణాలు :
1.విటమిన్ల లోపం ముఖ్యంగా ఇనుము, ఫోలిక్ ఆమ్లం, రిబోఫ్లావిన్ (విటమిన్ బీ2), బీ12 లోపం ఏర్పడినప్పుడు
2.తినేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు అనుకోకుండా నోటిలోపల చర్మంను దంతాలతో కొరుక్కోవడం
3.రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం
4.ఒళ్లు వేడి చేయడం వలన
5.దంతాల వ్యాధులు లేదా నోరు శుభ్రంగా లేకపోవడం
6.నీరు సరిపడేంత తీసుకోకపోవడం
7.ఔషధాల దుష్ప్రభావాల వలన
8.టూత్ పేస్ట్ లు తరచూ మారుస్తున్నప్పుడు
9.వైరస్, బాక్టీరియా, ఫంగస్
10.మౌత్ క్యాన్సర్ వలన
నోటి పుండ్లు నివారణ చర్యలు :
నోటి పూత కారణంగా ఆహారం, నీరు తీసుకోవడానికి ఇబ్బంది పడటం, మానసిక ఒత్తిడి, ఏ పనిపైనా దృష్టి కేంద్రీకరించలేకపోవడం వంటివి ఎదురవుతూ ఉంటాయి. ఈ సమస్య ను నివారించడానికి తోడ్పడే ఆహారపదార్ధాలు ఇవే...
1. నిద్రించే ముందు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం మాత్రమే కలిపి తీసుకోవాలి. దీని వల్ల రోగ నిరోధక వ్యవస్థ శక్తివంతం అవుతుంది.
2. బేకింగ్ సోడాను నీటిలో కలుపుకుని తాగాలి. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు బ్యాక్టీరియాతో పోరాడతాయి, ఆల్కలైన్ గుణాలు నోటి పుండ్లకు కారణమైన యాసిడ్లను న్యూట్రలైజ్ చేస్తాయి.
3. ఉల్లిపాయలోని సల్ఫర్ గుణాలు నోటి పుండ్లను మాన్పడంలో తోడ్పడతాయి.
4. కొత్తిమీరలో మంటను తగ్గించే, యాంటిసెప్టిక్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి నోట్లో పుండ్ల వల్ల వచ్చే నొప్పిని తగ్గిస్తాయి.
5. కొద్దిగా తేనె తీసుకుని పుండ్లు ఉన్న భాగంలో రాసుకోవడం వలన నొప్పి తగ్గి ఉపశమనం లభిస్తుంది.
6. తిన్న తర్వాత నోరు శుభ్రంగా కడగాలి.
7. నోటిలో పుండ్లు ఉన్నప్పుడు నెయ్యి లేదా కొబ్బరి నూనెను వాటి చుట్టూ రాసుకుని నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి.
8. ఉప్పును బాగా నీటిలో కరిగించి తర్వాత ఈ నీటితో పుక్కిలించుకోవడం వలన తక్షణ ఉపశమనం కలుగుతుంది.
9. నోటి పుండ్లు ఉన్నప్పుడు కొన్ని తులసి ఆకులు తీసుకుని బాగా నమలడం వలన ఆకుల నుండి వచ్చే రసం పుండ్లను త్వరగా నయం చేస్తుంది
Previous
Next Post »
0 Komentar

Google Tags