N95
masks with valves can be detrimental for preventing COVID-19
కవాటం ఉన్న ఎన్-95 మాస్కులు వాడొద్దు
ఎన్-95
మాస్క్లు, ముఖ్యంగా కవాటం (రెస్పిరేటరీ
వాలున్న) ఉన్న ఎన్-95 మాస్కులను ప్రజలు
వినియోగించ వద్దని కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల డైరెక్టర్ జనరల్
హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని ఈ మాస్కు అడ్డుకోలేదని, దీనివల్ల వైరస్ సోకే ప్రమాదం ఉందని తెలిపారు. వైద్యసిబ్బంది వినియోగానికి
ఉద్దేశించిన మాస్క్లను అనుచిత రీతిలో సామాన్య ప్రజలు వినియోగిస్తున్న తీరు తమ
దృష్టికి వచ్చిందని ఆరోగ్య శాఖకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్
పేర్కొంది. ఇంట్లో తయారు చేసుకునే మాస్క్లను వినియోగించేందుకు మార్గదర్శకాలు
ఆరోగ్యశాఖ వెబ్ సైట్లో ఉన్నాయని, వాటిని ప్రచారం చేయాలని
సూచించింది.
0 Komentar